ఆధిపత్య శక్తుల ‘కోల్డ్ వార్’ లో భారత్ చిక్కుకుందా?
భారత్ లక్ష్యంగా పావులు కదుపుతున్న చైనా, అమెరికా
By : The Federal
Update: 2025-10-18 08:00 GMT
డీ. రవికాంత్
రష్యా నుంచి భారత్ ఇక ముందు చమురు కొనుగోలు చేయబోవడం లేదని, ఆ మేరకు భారత ప్రధానితో జరిగిన ఫోన్ సంభాషణలో తనకు స్పష్టమైన హమీ ఇచ్చినట్లు ట్రంప్ చెప్పారు.
‘‘ భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను(ట్రంప్) సంతోషంగా లేను. వారు(ప్రధాని మోదీ) రష్యా నుంచి చమురు కొనుగోలు చేయరని ఈ రోజు నాకు హమీ ఇచ్చారు’’ అని ట్రంప్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇక నుంచి చైనా ను కూడా అదే పనిచేయమని కోరుతామని కూడా చెప్పారు.
ఇదే సమయంలో అమెరికా అధికారులు చైనా పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు కాదు.
కీలకమైన ముడి ఖనిజాలపై చైనాకు గుత్తాధిపత్యం ఉంది. వీటిలో 34 ఖనిజాల ఎగుమతిపై బీజింగ్ నియంత్రణలు విధించింది. ఈ నిర్ణయంతో అమెరికాకు చిర్రెత్తుకొచ్చింది.
యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ బీజింగ్ చర్యలను గ్లోబల్ సప్లై చైన్ అధికారాన్ని చేజిక్కించుకోవడంగా అభివర్ణించారు. కమ్యూనిస్ట్ పాలకులు దీనిని చైనా వర్సెస్ వరల్డ్ గా మార్చినట్లు ఆరోపించారు.
పై పరిణామాలను పరిశీలిస్తే ఆసియా అగ్రదేశాలతో వాషింగ్టన్ ఎలా వ్యవహరిస్తుందో తెలియజేస్తోంది. భారత్ ను రాయితీల ఒత్తిడికి గురి చేస్తోంది. ఇదే సమయంలో చైనా భయం, అనుమానం, వ్యూహాత్మక నియంత్రణను ఎదుర్కొంటోంది.
భారత్ అసమాన బేరాలు..
బీహార్ ఎన్నికలు ప్రారంభమయ్యే ముందు వాషింగ్టన్ లో ఎంతో ప్రచారం పొందిన ‘మెగా’ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని మోదీ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఇందులో జన్యుపరంగా మార్పిడి చేయబడిన మొక్కజొన్న పంటకు ఆమోదించడం సహ యూఎస్ నుంచి 15 బిలియన్ డాలర్ల మేర ముడి చమురును వాషింగ్టన్ నుంచి కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలు ఢిల్లీ తరఫున చర్చలలో పాల్గొన్న ఓ సంధానకర్త ప్రతిపాదించినట్లు సమాచారం.
కాకపోతే ఇవి అర్థరహితనమైన సందర్భంగా కనిపిస్తుంది. భారతీయ ఎగుమతులపై ట్రంప్ ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించారు. అందులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25 శాతం పెనాల్టీ సుంకాలు విధించారు. ప్రస్తుతం వీటిపై ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయసమీక్ష చేస్తోంది.
అమెరికా సుంకాల ప్రభావంతో భారత్ కూడా తన దేశాన్ని, మార్కెట్లను కాపాడుకోవడానికి విధానపరమైన రాయితీలు ఇవ్వాలి. చర్చల తరువాత కూడా భారత్ పై అమెరికా 16 నుంచి 18 శాతం సుంకాలు విధించే అవకాశం కనిపిస్తుంది. ఇది యూరోపియన్ యూనియన్, జపాన్ లపై విధించిన 15 శాతం కంటే ఎక్కువగా, పాక్ పై విధించిన 19 శాతానికి సమానంగా ఉండవచ్చు.
చైనాకు ఎలాంటి పరిస్థితి..
చైనా కూడా భారత్ కు వ్యతిరేకంగా గేమ్ మొదలు పెట్టింది. అమెరికాకు భారత్ దగ్గరవ్వడం సుతారము ఇష్టం లేదు. వాస్తవానికి బీజింగ్ ప్రతీకార చర్యలను ప్రారంభించింది. చైనా బుధవారం అధికారికంగా ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) లో భారత్ పై ఫిర్యాదు చేసింది.
భారత్ అసంబద్ద ఈవీ విధానాలను అవలంభిస్తోందని, న్యూఢిల్లీ డబ్ల్యూటీఓ నిబంధనలు ఉల్లంఘించినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా వినియోగదారులకు భారీగా సబ్సిడీలను ప్రకటించడంపై అది గుర్రుగా ఉంది.
అలాగే నిషేధించబడిన దిగుమతి విధానాలను అవలంభిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇది వాషింగ్టన్ తో, న్యూఢిల్లీ అతి స్నేహితం ప్రదర్శించకూడదని బీజింగ్ ఇచ్చిన ఓ హెచ్చరిక.
అమెరికాకి భారత్ లాగా చైనా లొంగిపోవడం లేదు. ఆర్థిక శక్తి సమతుల్యతను మార్చడానికి అది తన వంతు ప్రయత్నాలు చేసుకుంటూ పోతోంది. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్( ఖనిజ వనరులు) సరఫరా గొలుసులో దానికి లభించిన ఆధిపత్యాన్ని ఉపయోగించుకుంటోంది.
చైనీస్ నిబంధనల ప్రకారం.. చైనా ప్రాసెస్ చేసిన అరుదైన ఖనిజాలు 0.1 శాతం కంటే ఎక్కువ ఉండే వేరే చోట తయారు చేయబడి ప్రాసెస్ చేసిన కూడా దానికి బీజింగ్ అనుమతి తీసుకోవాలి. అమెరికా చెప్పినట్లు కొరియాలో స్మార్ట్ ఫోన్లను తయారు చేసి, వాటిని ఆస్ట్రేలియాలో అమ్మితే కూడా దానికి బీజింగ్ అనుమతి తీసుకోవాలి.
నియంత్రణ.. బలవంతం..
ప్రస్తుత ప్రపంచంలో చైనాకున్న శక్తి కారణంగా అది ఎలక్ట్రానిక్స్ నుంచి రక్షణ వ్యవస్థల వరకూ దేనినైనా తాకట్టు పెట్టగలదు. ఇది కేవలం వాణిజ్యం కాదు.. నియంత్రణ కూడా. అమెరికా దీనిని ఆర్థిక బలవంతపు చర్య అని అభివర్ణిస్తోంది. వాషింగ్టన్ ఇంతకుముందు ఇదే విధానాలతో సెమీకండక్టర్ పై ఆంక్షలు విధించింది. ఇవి నిజంగా ద్వంద్వ ప్రమాణాలు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చైనాపై అమెరికా నిందలు వేయడం. ఇటీవల వాణిజ్య చర్చల స్ఫూర్తిని చైనా విడిచిపెట్టిందని ఆరోపణలు గుప్పించింది. ట్రంప్ పరిపాలనా కాలంలో పారిశ్రామిక విధానాన్ని స్వీకరిస్తోంది. ఇది కూడా ఏకపక్షంగానే అమెరికా అధ్యక్షుడు చేస్తున్నారు.
‘‘చైనా లాంటి నాన్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థను మీరు ఎదుర్కొంటున్నప్పుడూ మీరు పారిశ్రామిక విధానాలను అమలు చేయాలి’’ అని బీసెంట్ సీఎన్బీసీ ఫోరమ్ సూత్రీకరించారు.
దీని అర్థం ఏంటంటే జాతీయ భద్రతకు కీలకమైన అమెరికన్ సంస్థలలో ఈక్విటీ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా వాటిపై పట్టు సాధించడం. ఈ చర్యతో చైనా నియంత్రణలలో ఉన్న సరఫరా గొలుసులపై అమెరికా ఆధారపడటం కాస్త తగ్గుతుంది.
చైనా వర్సెస్ వరల్డ్
అమెరికా అధికారులు చైనా ఆర్థిక వ్యవస్థను కమాండ్ అండ్ కంట్రోల్ ఆర్థిక వ్యవస్థగా వర్ణిస్తున్నారు. అమెరికా తన మిత్రదేశాల ఆర్థిక వ్యవస్థలలో జోక్యం చేసుకోవడం గానీ లేదా ఆజ్ఞాపించడం చేయదని బీసెంట్ అన్నారు.
రష్యా నుంచి 60 శాతం ముడి చమురు, 90 శాతం ఇరాన్ ఎగుమతులు చైనాకే వెళ్తున్నాయి. ఇప్పుడు అమెరికా తన యూరప్ మిత్రదేశాలను సైతం చైనాపై సుంకాలు విధించాలని కోరుతున్నారు. ఉక్రెయిన్ పై యుద్దానికి నిధులు సమకూరుస్తున్నారని, ఇది వంచన అని వైట్ హౌజ్ వాదన.
చైనా వాణిజ్య చర్చలపై బీసెంట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చలకి వస్తున్న ఉప మంత్రి లీ చెంగ్ గాంగ్ ను ఓ పోకిరిగా అభివర్ణించారు. అనేక సమావేశాలలో తమను అవమానాల పాలు చేశారని ఆరోపించారు.
అసలు తమ ఆహ్వానం లేకుండా ఆయన అమెరికా వచ్చారని అన్నారు. చైనా వసూలు చేస్తున్న పోర్ట్ ఫీజులపై ఆందోళన వ్యక్తం చేశారు. లీ చెంగ్ గాంగ్ ను తోడేలుగా అభివర్ణించారని, ఇది వాళ్ల ఇష్టమని కూడా చెప్పుకొచ్చారు.
డబ్ల్యూటీఓ కుట్ర
భారత్ విద్యుత్ వాహానాల సబ్సిడీలపై చైనా ఫిర్యాదు చేసింది. దేశీయ వినియోగాన్ని ప్రొత్సహించడానికి ఉత్పత్తిదారులకు అనుకూలంగా భారత్ కొన్ని విధానాలు తీసుకురావడం డబ్ల్యూటీఓ నియమాలకు విరుద్ధం అని బీజింగ్ ఆరోపిస్తోంది.
చైనా చేస్తున్న ఈ ఆరోపణలు హాస్యాస్పదం. తన దేశంలో సొంతంగా విద్యుత్ వాహానాలు, బ్యాటరీలను నిర్మించుకోవడానికి బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఇప్పుడూ చైనా విధానాలపై ఈయూ ప్రతిఘటన ప్రారంభించగా, యూఎస్ మార్కెట్ నిషేధం విధించింది.
డబ్ల్యూటీఓ ప్యానెల్ భారత్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా అమలు అసంభవమని కూడా న్యాయ నిఫుణులు చెబుతున్నారు. అయినప్పటికీ వచ్చేవాటిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చైనా భావిస్తోంది.
కొత్త ఆట..
రెండు ఆధిపత్య దేశాల మధ్య జరిగే పోటీలో భారత్ ప్రస్తుతం పావుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఒకటి ఆధిపత్యం కోసం పోరాడుతుండగా, మరొకటి ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ఆరాటపడుతోంది.
చరిత్రలో చాలా దేశాలు మిత్రదేశాలను శత్రుత్వంలోకి లాగాయి. దీనివలన చిన్న శక్తులు మూల్యం చెల్లించుకున్నాయి. ప్రపంచం డీ కప్లింగ్ కాదు. డీ రిస్క్ ను కోరుకుంటోందని, కానీ చైనా ఎగుమతి నియంత్రణ చేస్తే ప్రపంచం డీ కపుల్ చేయాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది.
ప్రపంచంలో వ్యూహాత్మక పరపతి మద్దతుతో మాత్రమే సార్వభౌమాధికారం గౌరవించబడుతుందనే పాఠం భారత్ ముందుంది. అది లేకుండా 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని కూడా ఓ అభ్యర్థిగా బరిలోకి దిగినట్లుగా భావించవచ్చు.
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను గౌరవిస్తుంది. ఇందులోని సమాచారం, ఆలోచనలు కేవలం రచయితకు సంబంధించినవి. ఫెడరల్ కేవలం ఓ వేదికగా మాత్రమే నిలుస్తుంది)