ఫోగట్ ఊర్లో తిండి లేదు, నిద్రలేదు, ఇంటింటా విషాదం
ఈఫిల్ టవర్‌కు 6,500 కి.మీ దూరంలో బలాలీ గ్రామాన్ని నిస్తేజం ఆవహించింది. ఫైనల్స్‌కు చేరుకున్నరెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటును జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈఫిల్ టవర్‌కు 6,500 కి.మీ దూరంలో బలాలీ గ్రామాన్ని నిత్సేజం ఆవహించింది. ఫైనల్స్‌కు చేరుకున్న భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
హర్యానాలోని బలాలీ గ్రామం ఫ్రీస్టైల్ రెజ్లర్ వినేష్ ఫోగట్ స్వస్థలం. ప్యారిస్ లో జరుగుతోన్న ఒలింపిక్ పోటీలో ఆమె భారత్ తరపున పాల్గొన్నారు. రెజ్లింగ్ విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అయితే ఉండాల్సిన శారీరక బరువు 50 కేజీల కంటే 100 గ్రాముల ఎక్కువగా ఉన్నారని ఆమెపై అనర్హత వేటు వేశారు.
అనర్హతకు వ్యతిరేకంగా ఫోగాట్ చేసిన అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) స్వీకరించింది. క్రీడలు ముగిసేలోపు నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.
హర్యానాలోని బలాలీ గ్రామంలో వినేష్ ఫోగట్ పూర్వీకుల ఇల్లు.
ఫోగట్‌కు స్వర్ణం చేజారడాన్ని బలాలీ గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏటా జరుపుకునే తీజ్ వేడుకలకు దూరమయ్యారు. అన్నపానీయాలు వారికి సహించడం లేదు.
‘వినేష్ స్వర్ణానికి అర్హురాలు’
ఫోగట్ పూర్వీకుల ఇంటికి సమీపంలోని సిమెంటు బల్లపై దిగాలున్న కూర్చున్న 65 ఏళ్ల కర్తార్ సింగ్.. ‘‘వినేష్ స్వర్ణానికి అర్హురాలు. ఒలింపిక్స్‌లో భారత సిబ్బంది నుంచి ఆమెకు అవసరమైన మద్దతు లభించలేదు’’ అని బరువెక్కిన హృదయంతో అన్నారు.
"ఫోగట్ బంగారు పతకాన్ని కోల్పోలేదు. కుట్ర పన్ని ఆమెకు బయటకు పంపాను. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఆమెపై అనర్హత వేటు వేయడాన్ని మేము అంగీకరించం. ఆమె డైటీషియన్, కోచ్‌లు, సహాయక సిబ్బంది ఏమి చేస్తున్నారు?" అని ప్రశ్నించాడు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న కర్తార్.
"వినీష్ తిరిగి వచ్చి ఏం జరిగిందో చెప్పేదాకా మేం దేన్నీ నమ్మం" అని కర్తార్ ది ఫెడరల్‌తో అన్నారు. ఆమె మొత్తం మహిళా రెజ్లింగ్ కమ్యూనిటీకి ఒక ప్రేరణ. ఆమె నిష్క్రమణ నిర్ణయం యువ రెజ్లర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
సిమెంటు బల్లపై మరో మూల కూర్చున్న వినేష్ తాత జగత్ సింగ్‌కు వినికిడి సమస్య ఉన్నా.. తన ఆలోచనలను పంచుకోవాలని తాపత్రయపడ్డారు.
"వినీష్, గీత, బబిత, ప్రియాంక, సంగీత.. ఒకప్పుడు సాధారణ అమ్మాయిలు. ఇప్పుడు ప్రపంచ స్థాయి మల్లయోధులుగా ఎదిగారు. వీరిలో వినేష్ అత్యంత దృఢమైన మహిళ. మహిళా రెజ్లర్ల నిరసనలో ఆమె ఆడపులిగా గర్జించింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో.. "అన్నారు 80 ఏళ్ల వినేష్ తాత జగత్ సింగ్.
బలాలీ గ్రామానికి వినేష్‌తో లోతైన అనుబంధం ఉందని కర్తార్ ది ఫెడరల్‌తో అన్నారు. "మేము ఆమెను మా కూతురిగా కాదు.. 1.3 బిలియన్ల ప్రజల కూతురిగా చూశాం. భారతదేశం మొత్తం ఆమెపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆమె నిజంగా అధిక బరువుతో ఉంటే.. ఫైనల్‌కు అర్హత సాధించిన ఆమెను మూడు బౌట్‌లలో పోటీ చేయడానికి ఎందుకు అనుమతించారు? ఇది పెద్ద కుట్రగా అనిపిస్తుంది. "అని కర్తార్ అన్నారు.
మూర్ఛపోయిన వినేష్ తల్లి..
‘‘వినేష్ తన బరువును తగ్గించుకోవడానికి రాత్రంతా పడుతున్న కష్టాన్ని ఆమె తల్లి దయా కౌర్ విని స్పృహతప్పి పడిపోయింది. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమెను సోనిపట్‌లోని వినేష్ అత్తమామల ఇంటికి తీసుకెళ్లాం" అని చెప్పారు.
ఫోగట్ సామాజిక వర్గానికి చెందిన జాట్ల 500 ఇళ్లను దాటుకొని వెళుతుండగా..వారిలో నిరుత్సాహం స్పష్టంగా కనిపించింది. ఫోగట్ బంగారు పతకం సాధించిన తర్వాత మీరు వచ్చి ఉంటే.. గ్రామంలో సంబరాలు వేరేలా ఉండేవని" స్థానికులు చెప్పడం వినబడింది.
వినేష్ తల్లికి ధైర్యం చెబుతూ..
బాలీవుడ్ చిత్రం ‘దంగల్’లో సాక్షి తన్వర్ పాత్ర పోషించిన దిగ్గజ రెజ్లర్లు గీత, బబితా ఫోగట్‌లు ప్రస్తుతం కష్ట సమయంలో వినేష్ ఫోగట్ తల్లితో ఉన్నారు.
‘వినేష్ అసాధారణమైన రెజ్లర్’
గీత, బబితాల తల్లి దయా కౌర్ ఇలా అన్నారు.. "పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్‌కు ఏమి జరిగిందనే దాని గురించి ప్రతి ఒక్కరికీ వారి స్వంత అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ రెజ్లింగ్ నియమాలను అర్థం చేసుకోలేరు. ఇది కేవలం కొంచెం అధిక బరువుతో కూడిన సందర్భం. ఆమె 100 గ్రాముల అధిక బరువు ఆమె అనర్హతకు దారితీసింది. వినేష్ అసాధారణమైన రెజ్లర్. కానీ ఈ క్రీడలో బరువును అదుపులో ఉంచుకోవడం చాలా కీలకం. విషాదంలో ఉన్న వినేష్ కుటుంబసభ్యులు గ్రామానికి వచ్చిన మీడియాతో కూడా మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు." అని కౌర్ జోడించారు.
"వినీష్ సాధారణంగా 53 కిలోల కేటగిరీలో పోటీ చేస్తుంది. కానీ పారిస్ ఒలింపిక్స్ కోసం 50 కిలోలకు తగ్గవలసి వచ్చింది. ఆమె బరువును కాపాడుకోవడానికి చాలా కష్టపడింది. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. కానీ కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హత వేయడం బాధాకరం." అని కౌర్ చెప్పారు.
ఒలింపిక్ స్థాయి రెజ్లర్‌ను సిద్ధం చేయడం గురించి కౌర్ మాట్లాడుతూ.. "ఒలింపిక్ అథ్లెట్‌కు శిక్షణ ఇవ్వడం ఏనుగును పెంచడం లాంటిది - దీనికి ఆహారం, సౌకర్యాలు, కఠినమైన శిక్షణపై రోజువారీ శ్రద్ధ అవసరం. నా భర్త, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహాబీర్ ఫోగట్ ఆరుగురు అమ్మాయిలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు శిక్షణ ఇచ్చారు.’’ అని చెప్పారు.
'వినీష్‌ని వదులుకోలేను'
‘‘తన కుమార్తెలు గీత, బబిత కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెలిచారు. ఈ కథ తర్వాత దంగల్ చిత్రంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.’’ అని మహాబీర్ ఫోగట్ ది ఫెడరల్‌తో అన్నారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ చిత్రంలో మహాబీర్ ఫోగట్ పాత్రను పోషించాడు.
‘‘ వినేష్ రెజ్లింగ్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెను భారతదేశానికి తిరిగి రానివ్వండి. నేను వినేష్, ఆమె అత్తమామలతో మాట్లాడి ఆమె నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని అడుగుతాను.”అని మహాబీర్ పేర్కొన్నారు. రెజ్లింగ్ కమ్యూనిటీ ఆమెను దూరం చేసుకోదు. ఆమె భారత్ కోసం తదుపరి ఒలింపిక్స్‌లో పోటీపడుతుంది" అని నమ్మకంగా చెప్పారు.
వేధిస్తోన్న సౌకర్యాల కొరత..
కొంతమంది అగ్రశ్రేణి మల్లయోధులను తయారు చేసిన బలాలీలో క్రీడా సదుపాయాలు అంతగా లేవు. ఫోగట్ సోదరీమణుల గ్రామంలోని ఒకేఒక్క రెజ్లింగ్ అరేనా శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి ప్రతి యువకుడు వినేష్ ఫోగట్ కావాలని కలలు కంటాడు.
"ఇక్కడ దాదాపు 20 మంది యువ మల్లయోధులు శిక్షణ పొందుతున్నారు. కానీ మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు. విద్యుత్, తాగునీరు, చాపలు కూడా స్థానికులు విరాళంగా ఇస్తున్నారు" అని మహాబీర్ చెప్పారు. పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ ఆడిన బౌట్‌లన్నింటినీ ఆమె కుటుంబాలతో పాటు వీక్షించానని, అనర్హత వేటుతో స్వర్ణం కోల్పోవడం గుండె పగిలినంత పనైందని అన్నారు.