కాశ్మీర్ లో ప్రధాని మోదీ యోగా సందడి

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

Update: 2024-06-21 07:38 GMT

అందరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాస్తవానికి దాల్ సరస్సు ఒడ్డున 7000 మందితో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వేదికను షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కెఐసిసి)లోకి మార్చారు. అక్కడే ఆయన యోగాససాలు వేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగా మనకు జీవించడంలో సహాయపడుతుందన్నారు. మనం ప్రశాంతంగా ఉన్నపుడు, ప్రపంచంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపగలమని పేర్కొన్నారు. యోగా మనలోని లోతైన భావాలతో కలుపుతుందని, మన చుట్టూ ఉన్నవారి సంక్షేమాన్ని గ్రహించడంలో యోగా దోహదపడుతుందన్నారు. నేటి ప్రపంచంలో యోగా ఒక విజ్ఞాన శాస్త్రమని, మనిషి మనసుపై దృష్టి పెట్టడమే దీనికి పరిష్కార మార్గమని మోదీ తెలిపారు.


Tags:    

Similar News