ఐపీఎల్ లో 2016 సీన్ రిపీట్ అవుతుందా, హైదరాబాద్ మెరుస్తుందా?

ఐపీఎస్ 2024 టోర్నీ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. క్వాలిఫయర్స్ స్టేజ్‌కు చేరిన టోర్నీ మరింత సస్పెన్స్‌గా మారింది. అందుకు నిన్న జరిగిన రెండు మ్యాచ్‌లు కారణం.

Update: 2024-05-20 09:33 GMT

ఐపీఎస్ 2024 టోర్నీ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. క్వాలిఫయర్స్ స్టేజ్‌కు చేరిన టోర్నీ మరింత సస్పెన్స్‌గా మారింది. అందుకు నిన్న జరిగిన రెండు మ్యాచ్‌లు కారణం. టాప్‌2 టైర్‌కు చేరడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వర్షం కలిసొచ్చింది. కేకేఆర్, రాజస్థాన్ తలపడాల్సిన మ్యాచ్ వర్షం పడటంతో రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అంతకుముందే పంజాబ్‌తలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. పంజాబ్ బౌలర్లను ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ చావబాదారు. దీంతో పాయింట్స్ పట్టికలో కీలక మార్పులు జరిగాయి. 14 పాయింట్లతో కేకేఆర్ టాప్ ప్లేస్‌లో ఉండగా రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్.. మూడో స్థానానికి పడిపోయింది. అక్కడున్న సన్‌రైజర్స్ రెండో స్థానాన్ని అందిపుచ్చుకుంది. పై మూడు స్థానాల కోసం మూడు జట్ల మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే నాలుగో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ మాత్రం కప్పు ఎలా కొట్టాలన్న దానిపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పాయింట్స్ టేబుల్ చూసిన వారంతా కూడా ఈసారి కూడా 2016 ఐపీఎస్ రిజల్ట్స్ రిపీట్ అవుతాయా అంటున్నారు.

2016లో ఏం జరిగింది..

2016లో జరిగిన ఐపీఎస్ టోర్నీలో కూడా క్వాలిఫయర్స్ టైమ్‌కి ఇప్పుడున్నట్లే కేకేఆర్, ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌లు టాప్‌4లో ఉన్నాయి. కానీ అప్పట్లో రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే జట్లపై సుప్రీంకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో 2016, 2017 టోర్నీల్లో ఆ జట్లు పాల్గొనలేదు. దాంతో 2016 టోర్నీలో గుజరాత్ లయన్స్ జట్టు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఆ టోర్నీలో గుజరాత్ లయన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు వరుసగా ఉన్నాయి. క్వాలిఫయర్స్ ముగించుకుని, ఫైనల్స్‌కు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ చేరుకున్నాయి. ఆ సమయంలో రెండు జట్లు ఫుల్ ఫామ్‌లో ఉన్నాయి. ఫైనల్లో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ మాత్రం 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. దీంతో ఎనిమిది పరుగుల తేడాతో 2016 ఐపీఎల్ టోర్నీని సన్‌రైజర్స్ కైవసం చేసకున్నారు. దీంతో ఇప్పుడు 2024లో కూడా రెండు టీమ్‌లు భారీ ఫామ్‌లో ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అని ఇరు జట్ల ఫ్యాన్స్ అంటున్నారు.

ఈసారి పక్కా సీన్ మారుద్ది..

అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం 2024 ఐపీఎల్‌లో 2016 ఐపీఎల్ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, అసలు సన్‌రైజర్స్, ఆర్‌సీబీ రెండు జట్లు ఫైనల్‌కు చేరడమే గగనం అవుతుందని అంటున్నారు. 2016లో కేకేఆర్ ఇప్పుడున్నంత బలంగా, ఫామ్‌లో లేదని, ఆర్ఆర్ కూడా పోటీలో లేదని గుర్తు చేస్తున్నారు. కానీ ఈసారి ఆ రెండు జట్లకు ఓడించి ఫైనల్స్ వెళ్లడం అనేది ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌కు ఒక అగ్ని పరీక్షలానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆదివారం జరగాల్సిన కేకేఆర్, ఆర్ఆర్ మ్యాచ్ జరిగి ఉంటే కథ వేరేలా ఉండి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఆ రెండు జట్లు ప్రస్తుతం టాప్ టైయర్ జట్లుగా ఉన్నాయని, దీంతో ఈ క్వాలిఫయర్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా మారనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News