‘డబ్బు కోసమే అలా చేశా..ఇంతలో అరెస్ట్ చేశారు’

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, మహారాష్ట్ర ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీని చంపబోతున్నదెవరు తనకు తెలసని కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ముంబై తీసుకొచ్చారు.

Update: 2024-10-30 13:12 GMT

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, మహారాష్ట్ర ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీని చంపబోతున్నదెవరు తనకు తెలసని కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ముంబై తీసుకొచ్చారు. అయితే డబ్బు కోసమే అలా చెప్పాల్సి వచ్చిందని విచారణలో నిందితుడు అంగీకరించాడు.

జీశాన్ సిద్ధిఖీ కార్యాలయానికి కాల్..

అక్టోబరు 25వ తేదీ సాయంత్రం బాంద్రాలోని జీషన్ సిద్ధిఖీ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. సల్మాన్ ఖాన్, జీషన్ ప్రమాదంలో ఉన్నారని, వారిని చంపడానికి కుట్ర జరుగుతోందని, హత్యచేసే వ్యక్తి ఎవరో తనకు తెలుసని చెప్పాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నంబర్‌ను ట్రాక్ చేసి నోయిడాలో గుర్ఫీన్ ఖాన్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తీసుకొచ్చారు. ఆ కాల్ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. మరోసారి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దామనుకునేలోపు తనను అరెస్ట్ చేశారని చెప్పాడు.

జీషన్ సిద్ధిఖీ తండ్రి, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని ఇటీవల ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది.

మరో ఇద్దరికి కేసులు..

జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తొలుత రూ. 5 కోట్ల డిమాండ్ చేస్తూ సల్మాన్‌కు వాట్సాప్ మెసేజ్ పంపాడు. తరువాత అది పొరపాటున వచ్చిందని మౌసిన్ పోలీసులకు చెప్పారు. అక్టోబర్ 30న ఒక కాలర్ ముంబై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నంబర్‌కు డయల్ చేసి రూ. 2 కోట్లు చెల్లించకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. కాల్ చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.

అసలు ఎందుకు సల్మాన్ టార్గెట్ అయ్యారు?

చాలా సంవత్సరాల క్రితం రాజస్థాన్‌లో కృష్ణ జింకలను చంపడంలో సల్మాన్ ప్రమేయం ఉందని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆరోపణ. 2022లో సల్మాన్ ఇంటికి సమీపంలో ఒక బెదిరింపు లేఖ దొరికింది. మార్చి 2023లో గోల్డీ బ్రార్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. 2024లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పన్వెల్‌లోని ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి అనధికారికంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ ఏడాది మొదట్లో బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఓ వ్యక్తి సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల తుపాకీ కాల్పులు జరిపాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్‌ఖాన్‌కు పోలీసులు భద్రత పెంచారు.

Tags:    

Similar News