కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్‌బామ్ ఎన్నికల బరి నుంచి ఎందుకు తప్పుకున్నాడు?

రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులుంటాయి. వాటిని రాజకీయనాయకులు సమయానుకూలంగా వేస్తుంటారు. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఘటన ఈ కోవలోనిదే. అసలేం జరిగిందంటే..

Update: 2024-04-30 06:36 GMT

కాంగ్రెస్ అధిష్టానం భోపాల్ లోక్‌సభ స్థానానికి అక్షయ్ బామ్‌ను ఎంపిక చేశారు. అయితే నామినేషన్ల దాఖలుకు ఒక రోజు ముందు ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరిపోయారు.కాంగ్రెస్‌కు ఇది ఊహించని పరిణామం. కారణాలు ఏమై ఉండొచ్చని జనం చెవులు కొరుక్కోడానికి ముందే మధ్యప్రదేశ్ చీఫ్ జితు పట్వారీ నోరు విప్పారు. బామ్‌ను బెదిరించి హింసించడం వల్లే అతను పార్టీ మారాడని చెప్పుకొచ్చారు.

“మూడు రోజుల క్రితం బామ్‌పై ఓ పాత కేసులో IPC సెక్షన్ 307 జోడించారు. అతన్ని బెదిరించి రాత్రంతా రకరకాలుగా హింసించారు. తర్వాతి రోజు ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు’’ అని సోమవారం శివపురిలో జరిగిన ర్యాలీలో పట్వారీ చెప్పారు.

బామ్, అతని తండ్రి కాంతిలాల్ ఇతరులు అక్టోబర్ 2007లో నమోదైన కేసులో నిందితులు. నిందితుల్లో ఒకరు తనపై కాల్పులు జరిపారని ఆరోపిచారు. ఈ కేసులో సెక్షన్ 307ని జోడించాలని బాధితుడు ఏప్రిల్ 5న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. 24న ఆ అభ్యర్ధనను ఆమోదించింది. బామ్, అతని తండ్రి మే 10న సెషన్స్ కోర్టులో హాజరుకావలసిందిగా కోరింది. బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగానే బామ్ పార్టీ మారారని పేర్కొన్న పట్వారీ..

‘‘మీకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే.. దయచేసి ఈ నియంతృత్వ పాలనకు మీ ఓటుతో స్వస్తి పలకండి.’’ అని ఓటర్లను కోరారు.

ఎవరీ అక్షయ్ కాంతి బామ్?

45 ఏళ్ల బామ్ ఎన్నికలకు కొత్త. తన జీవితంలో ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఇండోర్‌లో పలు విద్యాసంస్థలను నెలకొల్పిన బామ్ ఇండోర్ లోక్‌సభ స్థానం నుండి సిట్టింగ్ బిజెపి ఎంపి శంకర్ లాల్వానీ (62)తో పోటీకి దిగారు.

అక్షయ్ కాంతి బామ్ ఇండోర్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ముంబైలోని సిడెన్‌హామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ (సిమ్స్‌రీ) నుండి బికామ్ (ఆనర్స్) డిగ్రీ పొందారు. ఇండోర్‌లోని పిఎమ్‌బి గుజరాతీ కామర్స్ కళాశాల నుండి ఎల్‌ఎల్‌బి (ఆనర్స్), ఇండోర్‌లోని శ్రీ వైష్ణవ్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయ నుండి ఎంబిఎ పూర్తి చేశాడు. బామ్ ఇండోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్‌లో పిహెచ్‌డి కూడా చేశారు.

బామ్ కేవలం 23 సంవత్సరాల వయసులో 2003లో ఇండోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాని స్థాపించాడు. ప్రస్తుతం దానికి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2006లో ఇండోర్ నర్సింగ్ కాలేజీని, 2010లో ఇడిలిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించాడు. ప్రస్తుతం ఈ రెండింటికి కూడా ఆయనే చైర్మన్‌. అతను 2021లో స్థాపించిన ఇండోర్‌లోని ఆన్‌లైన్ ఇన్నోవేటివ్ లీగల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన Ledx లీగల్ లెర్నింగ్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు కూడా.

తోటి డాలీ కళాశాల పూర్వ విద్యార్థి అయిన బామ్ దిగ్విజయ సింగ్ ఆశీర్వాదంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత పీసీసీ మాజీ చీఫ్‌ కమల్‌నాథ్‌కు అక్షయ్ దగ్గరయ్యారు. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బామ్ పార్టీ టిక్కెట్‌పై కన్నేశాడు. కాని సాధించలేకపోయాడు. పార్టీ నేతలు ఆయనకు లోక్‌సభ టిక్కెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News