భారత్ కు ఆంక్షల వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. ఎందుకంటే,

ప్రపంచ పెత్తనమంతా తన చేతుల్లోనే ఉందని భావించే అమెరికా, భారత్ కు మరోసారి ఆంక్షల వార్నింగ్ ఇచ్చింది. తాము ఆంక్షలు విధించిన దేశంతో వ్యాపారం ఒప్పందాలు..

Update: 2024-05-14 07:18 GMT

భారత్- ఇరాన్ మధ్య జరిగిన ఛాబహార్ పోర్ట్ నిర్వహణ ఒప్పందం వాషింగ్టన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ తో ఏ దేశం ఎలాంటి ఒప్పందాలు చేసుకున్న ఆంక్షలు విధించే అవకాశం ఉందని వైట్ హౌజ్ ప్రకటించింది.

"చబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి ఇరాన్- భారత్ ఒక ఒప్పందంపై సంతకం చేశాయని మాకు తెలుసు. భారత స్వంత విదేశాంగ విధానంతో చబహార్ పోర్టు నిర్వహణకు సంబంధించి, దాని లక్ష్యాలు సాధించుకోవడానికి ఇరాన్ తో చర్చలు జరపడానికి మేము అనుమతిస్తాం” అని విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తన రోజువారీ వార్తా సమావేశంలో విలేకరులతో అన్నారు.
చాబహార్ ఓడరేవుపై ఇరాన్‌తో భారత్ చేసుకున్న ఒప్పందంపై ఒక ప్రశ్నకు సమాధానంగా, "నేను యునైటెడ్ స్టేట్స్‌కు సంబంధించి, ఇరాన్‌పై యుఎస్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. మేము వాటిని అమలు చేస్తూనే ఉంటాము" అని ఆయన చెప్పారు.
"ఏ సంస్థ అయినా, ఎవరైనా ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలను చేసుకుంటే, తరువాత జరగబోయే ప్రమాదం గురించి ఆలోచించుకోవాలి" అని ఇలాంటి విషయాలు మేం చెప్పడం చాలా సందర్భాల్లో మీరు చూసే ఉన్నారని పటేల్ అన్నారు. కాగా ఇరాన్‌లోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన చాబహార్ ఓడరేవులో టెర్మినల్ నిర్వహణ కోసం భారత్- ఇరాన్ సోమవారం 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశాయి, ఈ చర్య ప్రాంతీయ కనెక్టివిటీతో పాటు వాణిజ్య సంబంధాలను పెంచుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ సహకారం లేకున్నా మధ్య ఆసియాతో నేరుగా సంబంధాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది భారతీయ వ్యవసాయ, ఇంజనీరింగ్ వస్తువులను ఎగుమతి చేయడానికి ఉపయోగపడుతుంది.


Tags:    

Similar News