బడ్జెట్ 2025-26: ఏదీ ఖరీదైనది.. చౌకగా వచ్చేది?
కొన్ని వస్తువులపై అమాంతం తగ్గించిన సుంకాలు;
By : Praveen Chepyala
Update: 2025-02-01 09:58 GMT
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్నడూ లేనట్లు ఆర్థికమంత్రి వేతన జీవులపై వరాలు కురిపించారు. ఆదాయపన్ను చెల్లింపు పరిమితి రూ. 12 లక్షలకు పెంచి సంతోషపరిచారు.
కేంద్ర బడ్జెట్ 2025 ను సమర్పిస్తూ మొబైల్ ఫోన్లు, చార్జర్లు, క్యాన్సర్ మందులతో సహ కొన్ని వస్తువులపై కస్టమ్స్ రేటును తగ్గించనున్నట్లు తెలిపారు.
బంగారం.. వెండి..
బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీలను 6 శాతానికి, ప్లాటినం పై 6.4 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్ పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని సీతారామన్ ప్రతిపాదించారు.
చౌకగా వచ్చే వస్తువులు..
క్యాన్సర్ ను నయం చేసే 36 రకాల మందులపై ప్రాథమిక కస్టమ్ సుంకాల నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. ఇవి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడతాయి.
ఎలక్ట్రానిక్ వస్తువులతో ఒపెన్ సేల్స్ ఇతర భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించింది. కోబాల్ట్ పౌడర్, వ్యర్థాలు, లిథియం- అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్ తో సహ మరో 12 కీలకమైన ఖనిజాలకు ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహయించారు.
ఈవీ బ్యాటరీ..
ఈవీ బ్యాటరీ తయారీకి ముప్పై ఐదు అదనపు వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 అదనపు వస్తువులు మినహాయించబడిన మూలధన వస్తువుల జాబితాలో చేర్చారు. లెదర్ జాకెట్, షూస్, బెల్ట్, పర్సు కూడా చౌకగా మారింది.
అనలాగ్ ఉత్పత్తుల తయారీ, ఎగుమతి కోసం స్తంభింప చేసిన చేపల పేస్ట్ పై కస్టమ్స్ సుంకం 30 శాతం నుంచి ఏకంగా 5 శాతానికి తగ్గించారు.
ఏదీ ఎక్కువ ఖర్చు..
ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లేలలో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. ఇది టీవీలు, మొబైల్ ఫోన్ ల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.