భారత్ పై మాకు నమ్మకం ఉంది: రష్యా పర్యటనపై అమెరికా

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై అమెరికా స్పందించింది. మాకు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ పై నమ్మకం ఉందని వెల్లడించింది. యూన్ చార్టర్ కు అనుగుణంగా..

Update: 2024-07-10 11:10 GMT

ఉక్రెయిన్‌లో శాశ్వత, న్యాయమైన శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందనే యూఎస్ విశ్వసిస్తోందని పెంటగాన్ ప్రకటించింది. యూఎన్ చార్టర్, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండే విషయాన్ని భారత్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తెలియజేసి ఉంటుందని తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యాలో తన చారిత్రక పర్యటనను ముగించారు. ఈ పర్యటనపై వైట్ హౌజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

అమెరికా, భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా చూడడాన్ని కొనసాగిస్తుందని, ఆ దేశంతో దృఢమైన చర్చలు జరుపుతుందని పెంటగాన్‌ పేర్కొంది. ‘‘భారత్‌, రష్యా మధ్య చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి. యుఎస్ దృష్టికోణంలో, భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి. రెండు దేశాల భాగస్వామ్యాన్ని పూర్తి స్పష్టతతో కొనసాగించడానికి సిద్దంగా ఉన్నాయి. వారికి ఆ అధికారం ఉంది. ఈ వారంలోనే నాటో సమ్మిట్ ఉంది. దీనిలాగే ప్రపంచం దానిపై దృష్టి సారించింది. ” అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పాట్ రైడర్ ఒక విలేకరుల సమావేశంలో అన్నారు.
పుతిన్ ఐసోలేట్ అయ్యారా?
" పుతిన్ వేస్తున్న అడుగులు మాకు ఏ మాత్రం ఆశ్యర్యం కలిగించట్లేదు. రష్యా అధ్యక్షుడు చేస్తున్న ఈ యుద్దం ఆయన్ను, ఆ దేశాన్ని ఒంటరిని చేసింది. యుద్దం కోసం చాలా ఖర్చు చేసింది. ” అని మోదీ రష్యా పర్యటనపై ఆయన సమాధానమిచ్చారు.
"వారి దూకుడు నిర్ణయాలు, యుద్ధం చాలా ఖర్చుతో కూడుకున్నాయి. వాస్తవాలు కూడా అవే చూపిస్తున్నాయి. మేము భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా చూడటం కొనసాగిస్తాము. మేము వారితో బలమైన సంభాషణను కొనసాగిస్తాము, ”అని రైడర్ చెప్పారు.
"అతను (పుతిన్) మాస్కోలో ఉండటంతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య అధిపతి ఇప్పుడు అతనిని ఆలింగనం చేసుకోవడంతో ఒంటరిగా కనిపించడం లేదు" అని ఒక విలేఖరి వ్యాఖ్యానించారు. "ప్రధానమంత్రి [మోదీ] ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడిని కూడా కలుసుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారత్ తన శక్తి మేరకు ప్రయత్నిస్తుందని ఆయన తనకు హామీ ఇచ్చారనే విషయాన్ని నేను గమనించాను" అని రైడర్ చెప్పారు.
"ఉక్రెయిన్‌కు శాశ్వతమైన, న్యాయమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు న్యూఢిల్లీ మద్దతు ఇస్తుందని, UN చార్టర్, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత సూత్రాలకు కట్టుబడి ఉండటం గురించి పుతిన్ కు భారత్ తెలియజేసే ఉంటుందని మేము భావిస్తున్నామని’’ రైడర్ వ్యాఖ్యానించారు.
US వైఖరి..
రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలకు సంబంధించి అమెరికా ఆందోళనగా ఉందని జో బైడెన్ పరిపాలన విభాగం తెలిపింది. “రష్యాతో భారత్ సంబంధాల గురించి మా ఆందోళనల గురించి మేము చాలా స్పష్టతతో ఉన్నాము. మేము వాటిని ప్రైవేట్‌గా నేరుగా భారత ప్రభుత్వానికి వివరించాం. అలాగే కొనసాగిస్తున్నాము. ఈ విషయంలో మా వైఖరి మారలేదు, ”అని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మోదీ రష్యా నుంచి బయలుదేరిన తరువాత తన రోజువారీ ప్రెస్ మీట్ లో విలేకరులతో అన్నారు.
"మేము భారత్ ను కోరుతున్నది ఒక్కటే ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, దాని సార్వభౌమత్వాన్ని సమర్థించడంపై ఆధారపడిన UN చార్టర్ సూత్రాలకు మద్ధతు తెలపడం. వీటి ఆధారంగా ఉక్రెయిన్‌లో శాశ్వతమైన, న్యాయమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వమని మేము న్యూఢిల్లీని కోరుతూనే ఉన్నాము ” అని మిల్లర్ చెప్పారు.


Tags:    

Similar News