కమలా హ్యారిస్ కు ఎన్నికల బ్యాటన్ అందించిన బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ ను అధికారికంగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. చికాగో లో జరిగిన

By :  491
Update: 2024-08-20 07:23 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను అధికారికంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆమె "చారిత్రక అధ్యక్షురాలు", ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉత్తమ వ్యక్తిగా బైడెన్ కమలాను అభివర్ణించారు. సోమవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో వేదికపైకి వచ్చిన 81 ఏళ్ల బైడెన్ ఉద్వేగభరితంగా ఎన్నికల బాటన్ ను తన డిప్యూటీకి అందించారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78)తో పోటీ చేసేందుకు 59 ఏళ్ల హారిస్ గురువారం డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినేషన్‌ను అధికారికంగా ఆమోదించాల్సి ఉంది.

హారిస్ "చారిత్రక అధ్యక్షురాలు": బైడెన్
"యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను ఎన్నుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అని చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ పార్టీ జాతీయ సమావేశంలో వేలాది మంది సభ్యులు, నాయకుల ఆనందోత్సాహాల మధ్య బైడెన్ అడిగారు.
తన దేశ ప్రజలను ఓటు వేయాలని, తన డిప్యూటీని ఎన్నుకోవాలని కోరారు. “నేను నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను. నేను నా దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను.మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి. మీరు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి, కమలా, టిమ్‌లను అమెరికా అధ్యక్షురాలు, వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవాలి,” అని బైడెన్ తన మద్ధతుదారులను కోరారు. 2024 లో ట్రంప్ మహిళా శక్తిని రుచిచూడబోతున్నారని బైడెన్ జోస్యం చెప్పారు.
మనం మళ్లీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: బైడెన్
హారిస్ త్వరలో యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారని, తన పార్టీ సభ్యులు, నాయకుల ఆనందోత్సాహాల మధ్య బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. "మేము 2020లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాము. 2024లో మనం దానిని మళ్లీ రీపిట్ చేయాలి". అమెరికా భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. “ అమెరికా, నేను మీకు నా బెస్ట్ ఇచ్చాను. నా కెరీర్‌లో చాలా తప్పులు చేశాను. కానీ నా బెస్ట్ నీకు ఇచ్చాను,” బైడెన్ అన్నాడు.
“నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు స్వేచ్ఛ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రజాస్వామ్యం కోసం, అమెరికా కోసం ఓటు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కమలా హారిస్, టిమ్ వాల్ట్జ్‌లను ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అని బైడెన్ ఉత్సాహంగా ప్రశ్నించారు .
మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు: హారిస్ టు బిడెన్
“ఈ రాత్రి మీ అందరినీ చూస్తున్నప్పుడు, మన గొప్ప దేశపు గొప్ప అందం ఇక్కడే ఉన్నట్లు ఉంది. దేశంలోని ప్రతిరంగం, ప్రతి మూల నుంచి ఉన్న ప్రజలు ఇక్కడ నా కోసం భాగస్వామ్యం అయ్యారు.’’ అని సమావేశానికి హజరైన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హారిస్ తన మద్ధతుదారుల కరతాళ ధ్వనుల మధ్య అన్నారు. "ఈ నవంబర్‌లో మనమంతా కలిసి వచ్చి ఒకే స్వరంతో ప్రకటిద్దాం. ఆశ, ఆశావాదం, విశ్వాసంతో ముందుకు సాగుతామని’’ అని హ్యారీస్ అన్నారు.
ఎమోషనల్ అయిన బైడెన్
నాలుగు రోజుల సమావేశంలో తనను పరిచయం చేసిన తన కుమార్తె యాష్లే ను బైడెన్‌ను కౌగిలించుకున్నప్పుడు ఆయన కన్నీటిని తుడుచుకోవడం కనిపించింది. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచం, దేశం విధిని నిర్ణయిస్తాయని గమనించిన బైడెన్, తాను అలాగే హారిస్ కలిసి యూఎస్ ను నాలుగేళ్ల పాటు అసాధారణ పురోగతి సాధించేలా కృషి చేశామని అన్నారు. ట్రంప్ హయాంలో కంటే ఇప్పుడే దేశం సుభిక్షంగా ఉందని అన్నారు. తన హయాంలో పౌరులందరికీ మెరుగైన ఆరోగ్యభద్రత అందించామని చెప్పారు.
హరీస్ కు మద్ధతుగా కార్మిక సంఘాలు..
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న కమలా హ్యారీస్ కు US అగ్రశ్రేణి వర్కర్స్ యూనియన్ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో దేశ వ్యాప్తంగా యూనియన్ నాయకులు ఒక ఏకీకృత సందేశాన్ని పంచుకోవడానికి వేదికపైకి వచ్చారు.
యూనియన్లలో సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ (SEIU), లేబర్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ నార్త్ అమెరికా (LiUNA), ఇంటర్నేషనల్ బ్రదర్‌హుడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ (IBEW), అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్, కాంగ్రెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ (AFL-CIO), అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్, కౌంటీ, మునిసిపల్ ఎంప్లాయీస్, కమ్యూనికేషన్స్ వర్కర్స్ ఆఫ్ అమెరికా హ్యారీస్ కు మద్ధతు ప్రకటించాయి.


Tags:    

Similar News