'డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానించిన బిజెపి మంత్రి అమిత్ షా'
75 సంవత్సరాల భారత రాజ్యాంగం పై పార్లమెంటులో చర్చల సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా బాబా సాహెబ్ అంబేద్కర్ను అవమానించినాడు.
75 సంవత్సరాల భారత రాజ్యాంగం పై పార్లమెంటులో చర్చల సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా బాబా సాహెబ్ అంబేద్కర్ను అవమానించినాడు. సమాజ్వాది పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తుంది. అంబేద్కర్ అవమానం రాజ్యాంగ అవమానంగా అదేవిధంగా భారతజాతి అవమానంగా భావిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి తమ పార్టీ కార్యాలయంలో తెలిపినారు. ఇది తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నాం అంటూ వెంటనే హోం మంత్రి అమిత్ షా భారతజాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినారు.
బిజెపి పార్టీ గత పది సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ఎన్నో చర్యలకు ఉపకరించింది. రాజ్యాంగ లక్ష్యాలను అగౌరవపరుస్తూ పాలిస్తున్నది అని తెలిపారు. భారతజాతి విలువలను పెంపొందించే లౌకికవాదం, సమాజవాదం, ప్రజాస్వామ్యo లను అడుగడుగునా విస్మరించడం జరుగుతున్నదని సింహాద్రి అన్నారు.
అభివృద్ధిని ఏమాత్రం ప్రజలకు అందే విధంగా లేకుండా బిజెపి ప్రభుత్వం చేస్తున్నది. విద్యా, వైద్యాన్ని సామాన్య పౌరుడికి అందుబాటులో లేకుండా పోతున్నది, పరిశ్రమల రంగం ప్రైవేటీకరించబడడంతో యువత ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు అవకాశాలకు దూరంగా నెట్టబడుతున్నారు, భారత ప్రభుత్వం కార్పొరేట్ పక్షపాతిగా మారడంతో దేశంలో అసమానతలు ఘననీయంగా పెరిగినాయి అని అన్నారు. భారత అభివృద్ధి పేదరికాన్ని పెంచే విధంగా తయారయింది.
రాజ్యాంగం ఆశించిన సంక్షేమ రాజ్యం 80 కోట్ల ప్రజల రేషన్ వరకే పరిమితమైందని పార్టీ జనరల్ సెక్రెటరీ అక్కల బాబు గౌడ్ అన్నారు. యువకులు, స్త్రీలు, రైతులు ఎలాంటి సోషల్ సెక్యూరిటీలు లేకుండా జీవించాల్సిన స్థితి ఏర్పడింది. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి అని తెలిపారు.
డాక్టర్ అంబేద్కర్ను అవమానించడం తీవ్రంగా పరిగణిస్తూ సమాజ్వాది పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిసెంబర్ 28న ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. బిజెపి భారతజాతికి క్షమాపణ తెలియజేయనందున తదుపరి కార్యాచరణకై మేదో మధనం జరిపి నిర్ణయాలను ప్రకటించబడుతున్నదని ప్రకటించినారు.
పత్రికా సమావేశంలో రాష్ట్ర నాయకులు బరిగెల స్వరూప రాణి, బోనాల విజయకుమార్, మేకల బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.