రష్యా రాజధాని మాస్కోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ అణు రక్షణ దళాల చీఫ్ ఆయన సొంత అపార్ట్ మెంట్ వెలుపల హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశం ధృవీకరించింది. క్రిమ్లిన్, కీవ్ పై దండయాత్ర చేసిన మూడు సంవత్సరాలలో ఇంత పెద్ద సైనికాధికారి హత్యకు గురి కావడం ఇదే మొదటి సారి.
రష్యన్ ఫెడరేషన్ సాయుధ దళాల రేడియోలాజికల్, కెమికల్, బయోలాజికల్ డిఫెన్స్ దళాలకు చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్, ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అమర్చిన బాంబు దాడిలో చంపబడ్డారని రష్యా పరిశోధన కమిటీ, లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజన్సీ తెలిపింది. ఇదే విషయాన్ని రష్యా వార్తా సంస్థ ‘టాస్’ తెలిపింది. పేలుడు కోసం 300 గ్రాముల టీఎన్టీని ఉపయోగించినట్లు వెల్లడించింది.
రష్యాకు చెందిన టెలిగ్రామ్ ఛానెల్ కిరిల్లోవ్, ఆయన సహాయకుడు మృతి చెందిన ఫోటోలను చూపించాయి. ప్రవేశ ద్వారం మొత్తం ధ్వంసమై, శిథిలాల కింద ఉన్న వారి మృతదేహాలు అందులో స్పష్టంగా కనిపించాయి.
రసాయన ఆయుధాలు ఉపయోగించడం..
ఉక్రెయిన్ పై దండయాత్ర చేసిన రష్యా.. తరువాత రసాయన ఆయుధాలు ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కిరిల్లోవ్ పై దీనిపై ఉక్రెయిన్ ప్రాసిక్యూషన్ చేయాలని నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. అయితే రష్యా ఈ ఆరోపణలు ఖండించింది.
కిరిల్లోవ్ TOS-2 అనే థర్మోబారిక్ రాకెట్ లాంచర్‌ను అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ ఆయుధాలు తరువాత ఉక్రెయిన్ లో ఉపయోగించారు.
క్లోరోపిక్రిన్, రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (OPCW)చే నిషేధించబడింది. ఇది ఒక జిడ్డుగల ద్రవం. ఇది మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసే రసాయనంగా పేరుగాంచింది. ఈ రసాయనం మొదటి ప్రపంచ యుద్ధంలో టియర్ గ్యాస్ రూపంలో విస్తృతంగా ఉపయోగించారు.
తమ వద్ద సైనిక రసాయన ఆయుధాలు లేవని రష్యా పేర్కొంది. అయితే యుక్రెయిన్ భద్రతా సంస్థలు మాత్రం ఫిబ్రవరి 2022 నుంచి యుద్ధభూమిలో 4,800 కంటే ఎక్కువ రసాయన ఆయుధాలను ఉపయోగించినట్లు పేర్కొంది.
హై-ప్రొఫైల్ హత్య
జనరల్ కిరిల్లోవ్‌ని ఏకంగా రష్యా భూభాగంలో చంపడం అనేది ఆ దేశంలో సంచలనం సృష్టించింది. అక్టోబర్ 2022లో ఒక ప్రముఖ జాతీయవాది కుమార్తెను మాస్కో సమీపంలో కార్-బాంబ్ దాడితో హత్యకు గురయ్యారు. ఇలా అనేక మందిని ఉక్రెయిన్ చేత హత్యకు గురయ్యారు. అంతకుముందు బ్రిటన్ కూడా కిరిల్లోవ్ సహ ఇతర అణు రక్షణ దళాలల ఉన్నతాధికారులను వాచ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.