ట్రంప్ రెండో అధ్యాయం మొదలు

అధికారంలోకి వస్తూనే రెండు ఎమర్జన్సీలను ప్రటించారు.;

By :  Admin
Update: 2025-01-21 03:40 GMT

అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్చ(Donal Trump) ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలు) ఆయనతో పదవీ స్వీకారం చేయించారు.

విపరీతమైన చలి కారణంగా వేడుకలు క్యాపిటల్ భవనం వెలుపల కాకుండా లోపలే నిర్వహించారు. ఇదే వేదికపై జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ప్రసంగించిన ట్రంప్, అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని అన్నారు. ఈ రోజు నుంచి అమెరికా అభివృద్ధి చెందుతుంది, గౌరవం పొందుతుంది అని ఆయన చెప్పారు. ప్రపంచంలో అమెరికా అజేయంగా నిలబడుతుందని ప్రకటించారు. అమెరికా నాగరికత, అమెరిక పౌరుల గౌరవమర్యాదలు పెరుగుతాయని అంటూ చీకటి అధ్యాయానికి జనవరి 20 ముగింపు పలుకుతుందని అన్నారు.బ అమెరికా-మెక్సికో బాధ్యతలు స్వీకరించాక, తొలి ప్రసంగం చేస్తూ సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీనికోసం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. అన్ని చట్టవిరుద్ధమైన ప్రవేశాలు "తక్షణమే నిలిపివేస్తాం" అని ఆయన చెప్పారు. అక్రమ వలసదారులను తిరిగి పంపించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించారు.


Tags:    

Similar News