దేశ వారసత్వం, సైనిక శక్తికి వేదికగా నిలిచిన పరేడ్

మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన త్రివిధ దళాలు;

Update: 2025-01-26 13:04 GMT

భారత్ గణతంత్య్ర రాజ్యాంగంగా అవతరించి ఆదివారంతో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఎర్రకోటపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయపతాకాన్ని ఎగరవేశారు. తరువాత ఢిల్లీలోని కర్తవ్య పథ్ లోని జరిగిన సెరిమోనియల్ పరేడ్ లో దేశం తన సైనిక పరాక్రమాన్ని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది.

ఈ వేడుకకు దాదాపు 10 వేల మంది ఆహుతులు విచ్చేశారు. పారా ఒలంపిక్ కంటేంజెంట్ సభ్యులు, అత్యుత్తమ పనితీరు కనపరచిన సరిహద్దు గ్రామాల సర్పంచ్ లు, చేనేత కళాకారులు, అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కార్మికులు ఉన్నారు.

ఈ వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హజరయ్యాడు. కవాతులో ఇండోనేషియాకు చెందిన కవాతు బృందం, బ్యాండ్ బృందంలో పాల్గొన్నారు. ఇండోనేషియా నుంచి ఈ వేడుకకు హాజరైన నాల్గో అధ్యక్షుడు సుబియాంటో. ఇంతకుముందు ఆ దేశ తొలి అధ్యక్షుడు సుకర్ణో తొలిసారిగా భారత గణతంత్య్ర వేడుకలకు అతిథిగా వచ్చారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకల థీమ్ ను ‘‘ స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’’ అని పేరు పెట్టారు.
పరేడ్ లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు సంస్థల నుంచి 15 శకటాలు ప్రదర్శించారు. కవాతు సందర్భంగా దేశం తన సైనిక పరాక్రమాన్ని, గణతంత్య్ర రాజ్యాంగాన్ని తన ప్రయాణాన్ని ప్రదర్శించడంలో ఎదుర్కొన్న ప్రదర్శించారు.
ఆర్మీ తన ఆధీనంలోని యుద్ద నిఘా వ్యవస్థ సంజయ్, డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణి( ఉపరితలం నుంచి ఉపరితలం) తో పాటు బ్రహ్మోస్, పినాక, ఆకాశ్ తో పాటు సహా కొన్ని అత్యాధునిక రక్షణ వేదికలను దేశం మొదటిసారిగా ఉత్సవ కవాతులో ప్రదర్శించారు.
టీ-90 భీష్మ యుద్దట్యాంకులు, శరత్( పదాతి దళం మోసే వాహనం బీఎంపీ-II) షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్ 10 మీ, నాగ్ మిస్సైల్ సిస్టమ్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్ సిస్టమ్ ‘ అగ్ని బాన్’ భజరంగ్ కూడా ఇందులో ప్రదర్శించారు.


Tags:    

Similar News