‘‘ఈ యుద్ద కథనాలు దేశానికి అత్యంత ప్రమాదకరం‘‘

ప్రముఖ జర్నలిస్ట్, రచయిత అశుతోష్;

Translated by :  Praveen Chepyala
Update: 2025-04-30 11:57 GMT

(మూలం.. నీలాంజన్ ముఖోపాధ్యాయ)

పహల్గామ్ సంఘటనను ఉపయోగించి హిందువులను ఏకం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయత్నిస్తుందని ప్రముఖ రచయిత,జర్నలిస్ట్ అశుతోష్ అన్నారు.

‘ది ఫెడరల్ ’ కు చెందిన నీలాంజన్ ముఖోపాధ్యాయ హోస్ట్ చేసిన ‘‘ఆఫ్ ది బీటేన్ ట్రాక్’’ తాజా ఎపిసోడ్ కు ఆయన అతిథిగా వచ్చారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత సుదూర రాజకీయ, సామాజిక చిక్కులను 2024 ఎన్నికల తరువాత మారిన భారత రాజకీయాల పరిణామాలను ఆయన ప్రస్తావించారు.

ఈ మధ్య అశుతోష్ తన తాజా పుస్తకం ‘‘రిక్లెయిమింగ్ భారత్’’ లో భారత ప్రజాస్వామ్య స్థితిని చాలా లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేశారు.Full View

ప్రశ్న: పహల్గామ్ ఉగ్రవాద ఘటన భారతదేశ రాజకీయ కథనాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని మీరు చూస్తున్నారు?
పహల్గామ్ సంఘటనను ఉపయోగించి హిందువులను ఏకం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ‘‘హిందూ ఖత్రే మే హై’’ కథనాన్ని అవకాశంగా తీసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నా అభిప్రాయం ప్రకారం..పహల్గామ్ దాడి బీజేపీని దెబ్బతీస్తుంది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి.
మొదటిది ఉగ్రవాదులు హిందువులను నేరుగా లక్ష్యంగా చేసుకుని భారత భూభాగంలో దాడి చేశారు. ఇది ఇన్నాళ్లుగా మోదీ- అమిత్ షా నిర్మించిన హిందూ ఇమేజ్ పై తీవ్రంగా ప్రశ్నలు లేవనెత్తింది. మోదీ 56 అంగులాల ఛాతీ నాయకత్వంలో హిందువులు సురక్షితంగా లేరని ఈ సంఘటన నిరూపించింది. ఉగ్రవాదులు తమ మతాన్ని అడిగి మరీ హిందువులను కాల్చి చంపడం వారికి నిజంగా ఎదురుదెబ్బే.
ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ఉగ్రవాదం అంతం అవుతుందని కాశ్మీర్ స్వర్గంగా మారుతుందని మోదీ - షా ద్వయం ప్రకటించారు. అయితే పహల్గాం ఘటన మాత్రం జరిగింది. అక్కడ భద్రతా వ్యవస్థ కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి. దీని గురించి కూడా ప్రజలు కేంద్రాన్ని ప్రశ్నిస్తారు. ఇది రెండో ముఖ్యమైన అంశం.
అయితే దాడి తరువాత సాధారణ కాశ్మీరీలు స్పందించిన తీరు సానుకూల దృక్ఫథాన్ని కలిగిస్తుంది. దాడి తరువాత కాశ్మీరీలు, ఉగ్రవాదులపై సామూహికంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సంఘటనకు జరగడానికి 48 గంటల ముందు వరకూ నేను జమ్మూకాశ్మీర్ లోనే ఉన్నాను. పర్యాటకం బాగా అభివృద్ది చెందుతోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
1991 లో నేను చూసిన కాశ్మీర్.. ప్రస్తుతం పహల్గామ్ ఘటన తరువాత కాశ్మీర్ కు చాలా తేడా ఉంది. ఇది విషాదాన్ని మతతత్వంగా మార్చడానికి చేసిన ప్రయత్నాల వైఫల్యాన్ని చూపిస్తుంది.
పహల్గామ్ దాడి తరువాత భారత్ లోని ముస్లింలు, కాశ్మీరీలు భౌతికంగా లక్ష్యంగా మారతారని మీరు ఆందోళన చెందుతున్నారా?
దేశంలో ఇప్పటికే జరుగుతున్న కొన్ని చెదురుమదురు సంఘటనలలో కొంతమంది ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు. నిజానికి పాకిస్తాన్ కూడా కోరుకునేది ఇదే.
ఏప్రిల్ 14న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ రెండు దేశాల సిద్దాంతాన్ని ప్రస్తావిస్తూ హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతులని మహ్మాద్ అలీ జిన్నా సిద్దాంతాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు.
పహల్గామ్ దాడి తరువాత భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ దీనికి అభ్యంతర పెట్టింది. తను కూడా కొన్ని ఒప్పందాలను నిలిపివేసింది. ఇది ఆందోళనకరమైన విషయం.
ముస్లిం లీగ్ 1940 లో చేసిన ప్రకటన ఇక్కడ మరోసారి పునరావృతం అయ్యే అవకాశం ఉంది. భారతీయ ముస్లింలు హిందువులతో సహజీవనం చేయలేరని చెప్పడం పౌరుల మధ్య కలహాలను రేకెత్తించడం వారి లక్ష్యం. పాకిస్తాన్ పన్నే ఉచ్చులో భారత సమాజం చిక్కుకోకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలి.
రాజకీయాల్లోకి అడుగుపెడుతూ మీ కొత్త పుస్తకం ‘రీక్లెయిమింగ్ భారత్ ’ లో 2024 తీర్పు స్ఫష్టమైన ఆదేశం కాదని మీరు రాశారు? ఎందుకో వివరించగలరా?
నిజంగా అలాందేమి లేదు. నరేంద్ర మోదీ ప్రాథమికంగా ఎలాంటి సంప్రదింపులు లేని వ్యక్తిత్వం. ఆయన ఒక తరంలో వచ్చిన నాయకుడు. చాలా ధృడ సంకల్పం, చాలా కేంద్రీకృతమైన నాయకుడు.
పహల్గామ్ దాడి తరువాత మోదీ రాష్ట్రపతికి అత్యవసరంగా వివరాలు చెప్పలేదు. లేదా అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదు. అటువంటి పరిస్థితులలో ప్రధానమంత్రి ఉండాలని సంప్రదాయంగా భావిస్తున్నారు.
2024 తరువాత మోదీ ఇప్పటికే అధికారిక శక్తులను ఈడీ, సీబీఐ ప్రభుత్వ యంత్రాగాన్ని నియంత్రిస్తున్నారు. దీని కారణంగా సంకీర్ణ భాగస్వాములు మచ్చిక చేసుకున్నారు. ఎన్నికల తరువాత మోదీ కచ్చితంగా తన ప్రభావాన్ని కోల్పోయారు.
వారణాసిలో అంతకుముందు ఎన్నికల్లో ఆయన 10 లక్షల మెజారిటీతో గెలవగా మొన్నటి ఎన్నికల్లో ఆయన మెజారిటీ 1.5 లక్షలకు పడిపోయింది. అయినప్పటికీ ఆయన వ్యక్తిత్వం మారలేదు.
2024 తరువాత మోదీతో ఆర్ఎస్ఎస్ సంబంధ ఎలా అభివృద్ది చెందుతోంది?
మోదీ, అమిత్ షా ల నుంచి ఆర్ఎస్ఎస్ తిరిగి తన స్థానాన్ని పొందాలనుకుంటోంది. హిందూత్వం విస్తరించినప్పటికీ బీజేపీ అంతర్గత సంస్థ బలహీనపడిందని వారు గ్రహించారు.
బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించడంలో జాప్యం ఈ తగాదాను హైలైట్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ బలమైన స్వతంత్య్ర నాయకుడిని కోరుకుంటోంది. జేడీ నడ్దా లాంటి మరో వ్యక్తిని కోరుకోవడం లేదు. మోహన భాగవత్ ను కలవడానికి మోదీ నాగ్ పూర్ రావడం ఒక దిగజారిన పర్యటన. మోదీ ఒత్తిడిలో ఉన్నారని ఇది చూపిస్తుంది. సంధిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.
ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తే ఆటమారి ఉండేదని కూడా మీరు రాశారు.. ఎందుకు?
గతాన్ని పరిశీలిస్తే ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే అది మోదీకి కచ్చితంగా పెద్ద తగిలిఉండేది. బలమైన అభ్యర్థి లేకపోయినా మోదీ ఆధిక్యం భారీగా తగ్గింది. ప్రియాంక పోటీ చేసి ఉంటే కనీసం బలమైన సవాల్ అయిన మోదీ- షాలను కలవరపెట్టేది.
అమిత్ షా చివరి రోజుల్లో వారణాసిలో మకాం వేయాల్సి వచ్చింది. గట్టి పోటీతో మోదీ భయపడిపోయాడు. ఒకప్పుడు ఆయనకు ఉన్న అజేయమైన శక్తి ఇప్పుడు లేదు.
భారత ఎన్నికల సంఘం విశ్వసనీయత గురించి ఏమిటీ?
ఎన్నికలు ఇకపై స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగవని నేను పూర్తిగా చెప్పవనప్పటికీ, ఎన్నికల కమిషన్ విశ్వసనీయత గురించి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2024 లో అపూర్వమైన తమ ప్రచారం జరిగింది.
ఎన్నికల కమిషన్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు. ఓటింగ్ శాతాలను పెంచుకుంటూ పోయింది. మహారాష్ట్ర వంటి ప్రదేశాలలో ఓటర్ల సంఖ్యలో ఊహించలేని పెరుగుదల కనిపించింది.
ఇవన్నీ ఎన్నికల సంఘం రాజీపడినట్లు సూచిస్తున్నాయి. ఈ నమ్మకం కోల్పోవడం ప్రజాస్వామ్యానికే ముప్పు కలిగిస్తుంది. ఎన్నికలు తారుమారు చేస్తున్నారని ప్రజలు నమ్మడం ప్రారంభిస్తే ప్రజాస్వామ్యంపై నమ్మకం కూలిపోతుంది.
ఎన్నికల సమయంలో దర్యాప్తు సంస్థలను విస్తృతంగా ఉపయోగించడాన్ని కూడా మీరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. మీ అభిప్రాయం ఏంటీ?
2014 నుంచి భారత్ నెమ్మదిగా సైద్దాంతికంగా మారే దిశలు అడుగులు వేస్తోంది. వారి సైద్దాంతిక దేశంలో ప్రతి ఒక్కరూ వారికే మద్దతు ఇవ్వాలి. లేదా పక్కకు పారిపోవాలి. ఎన్నికల ప్రచారంలో అర్వింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయడం ఇందులో భాగం.
ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారు. ఇది ఇకపై చట్ట అమలు గురించి కాదు. సైద్దాంతిక, మెజారిటీ భారత్ ను సృష్టించడం గురించి.
ఒకప్పుడు ప్రత్యామ్నాయా రాజకీయాలకు ఆశాకిరణంగా ఆప్ నిలిచింది. ఇప్పుడు ఆ పార్టీని మీరు ఎక్కడ చూస్తున్నారు?
ఢిల్లీలో ఆప్ పతనం ఆ పార్టీ నైతిక మూలధనాన్ని కోల్పోయిందని చూపించింది. అది ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే ప్రవర్తించడం ప్రారంభించింది. నైతిక బలం, నిర్మాణం, పరిమిత వనరులు లేకుండా ఆప్ కూలిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పంజాబ్ నిలుకోవడంలో విఫలం అయితే దానికి దేశంలో ప్రాముఖ్యం తగ్గిపోతుంది.
ఒకప్పుడు మధ్యతరగతి ఆశలకు చిహ్నంగా కనిపించేది. నేడు అది ఒక పార్టీలా మారింది. పహల్గామ్ దాడి తరువాత రాజకీయ క్షణం భారతదేశ భవిష్యత్ ను గణనీయంగా మార్చగలదు. ఇది భారతదేశ రాజకీయ వ్యవస్థకే కాకుండా పౌర సమాజం, సంస్థలు, ఓటర్లకు ఒకపరీక్ష.


Tags:    

Similar News