టిట్ ఫర్ టాట్, ‘హిందీ లేఖలకి తమిళంలో సమాధానం’

కేంద్రమంత్రి కార్యాలయం నుంచి తనకు పదే పదే హిందీలో లేఖలు రావడంపై తమిళనాడు ఎంపీ వినూత్నరీతిలో తన నిరసన తెలిపారు.

By :  491
Update: 2024-10-26 11:51 GMT

తనకు హిందీ రాదని చెప్పినప్పటికీ, ఇచ్చిన ఫిర్యాదుపై మాటీమాటీకి హిందీలోనే లేఖలు వస్తున్నాయని డీఎంకే రాజ్యసభ సభ్యుడు పుదుక్కోట్టై ఎంఎం అబ్దుల్లా ఆరోపించారు. ఆయన కేంద్రమంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టుపై తమిళంలో స్పందించారు. రైళ్లలో ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలను అబ్దుల్లా లేవనెత్తిన తర్వాత ఇదంతా ప్రారంభమైంది.

ఎంపీ ఫిర్యాదు
రెండు లేఖల కాపీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తాను హిందీని చదవలేనని మంత్రి కార్యాలయంలోని అధికారులకు అనేకసార్లు రిమైండర్ చేసినప్పటికీ, తనకు హిందీలో లేఖలు వస్తూనే ఉన్నాయని అబ్దుల్లా ఫిర్యాదు చేశారు. కాబట్టి, అబ్దుల్లా అదే కోణంలో జవాబు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఆయన అనుసరించిన విధానం తమిళంలో ఒక లేఖ రాశారు. 

“ రైల్వే శాఖ సహాయ మంత్రి కార్యాలయం నుంచి ఉత్తరం ఎప్పుడూ హిందీలో వస్తోంది, నేను మంత్రి కార్యాలయంలో పోస్ట్ చేసిన అధికారులకు ఫోన్ చేసి నాకు హిందీ రాదని, దయచేసి లేఖను ఆంగ్లంలో పంపండి, అర్ధించాను. కానీ వాళ్లు అదే పని మళ్లీ మళ్లీ చేస్తూనే ఉన్నారు " అని ఎంపీ ఎక్స్‌లో తెలిపారు.
ఇంగ్లీషులో రాయండి..
ఇక నుంచి తనకు ఆంగ్లంలో లేఖలు పంపవచ్చని డీఎంకే ఎంపీ తమిళంలో అభ్యర్థించారు. వలసవాద చిహ్నాలపై పోరాటం పేరుతో మోదీ ప్రభుత్వం హిందీని దేశంపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని డీఎంకే బహిరంగంగా హెచ్చరిస్తోంది.



Tags:    

Similar News