యూపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

సివిల్ వివాదాలను, క్రిమినల్ కేసులుగా ఎందుకు మారుస్తున్నారని తలంటిన న్యాయస్థానం;

Update: 2025-04-08 05:50 GMT
సుప్రీంకోర్టు

సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చాలని తరుచుగా వస్తున్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ లో తరుచుగా సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు మారుస్తున్నారని, చట్టాన్ని ఎందుకు విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులను మందలించింది.

యూపీలో చెక్ బౌన్స్ కేసును పోలీసులు సివిల్ కేసు నుంచి క్రిమినల్ కేసు గా మార్చాలని కోరుతూ చార్జీషీట్ దాఖలు చేశారు. దీనిపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. సివిల్ కేసును, క్రిమనల్ కేసుగా మార్చడానికి పోలీసులు లంచాలు తీసుకున్నారని అభియోగాలు మోపారు.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం, భవిష్యత్ లో ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తే పోలీసులపై కోర్టు ఖర్చులు విధిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హెచ్చరించారు. ఈ కేసులో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తూ రెండువారాల్లోగా స్పందన తెలియజేయాలని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ ను, దర్యాప్తు అధికారిని ఆదేశించింది.
‘‘యూపీలో జరుగుతున్నది తప్పు. ప్రతిరోజు సివిల్ దావాలను క్రిమినల్ కేసులుగా మారుస్తున్నారు. ఇది అసంబద్దం, కేవలం డబ్బు ఇవ్వకపోవడాన్ని నేరంగా పరిగణించలేము. ఐఓను తమ వద్దకు రావాలి. కేసు పరిష్కరించే చొరవ తీసుకుంటాము.
అతను పాఠం నేర్చుకోవాలి. మీరు చార్జీషీట్ దాఖలు చేసే విధానం ఇది కాదు. యూపీలో ఇలాంటివి రోజు రోజుకు పెరుగుతుండటం వింతగా ఉంది. న్యాయవాదులకు పౌర అధికార పరిధి కూడా ఉందని మర్చిపోయారు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.
‘‘మేము దీనిని బైపాస్ చేస్తాం. కానీ మరోసారి ఇలాంటి కేసు మా ముందుకు వస్తే పోలీసులే బాధ్యులవుతారు. యూపీ పోలీస్ బాస్ అఫిడవిట్ దాఖలు చేయనివ్వండి. ఇది చట్టాన్ని విచ్చిన్నం చర్యలు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
సివిల్ కేసులను, క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణి పెరుగుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది డిసెంబర్ లో కొన్ని రాష్ట్రాల్లో ఇది బలంగా కొనసాగుతున్నట్లు ఉన్నత న్యాయస్థానం గుర్తించింది.
తరుచుగా సివిల్ విషయాలు, క్రిమినల్ కేసులుగా మార్చడం వలన సివిల్ అధికార పరిధిలో పరిష్కరించే అంశాలను న్యాయస్థానం దగ్గరికి తీసుకువచ్చి కోర్టు భారాన్ని పెంచుతున్నారని అప్పట్లో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.



Tags:    

Similar News