రేపు భూమి మీదకు రాబోతున్న సునీతా విలియమ్స్, విల్మోర్

అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5.57 నిమిషాలకు రాబోతున్న క్రూ-9;

Update: 2025-03-17 04:45 GMT

తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చి 17(మంగళవారం) తిరిగి భూమి మీదకు వస్తారని నాసా ప్రకటించింది.

విలియమ్స్, విల్మోర్ లను స్పేస్ ఎక్స్ క్రూ-9 డ్రాగన్ అంతరిక్ష నౌకలో తిరిగి భూమి మీదకు రాబోతున్నారని యూఎస్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. ఫ్లోరిడా తీరంలోని స్ప్లాష్ డౌన్ కోసం కేటాయించిన సమయాన్ని సైతం వెల్లడించింది.
నాసా ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57( భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3.27 నిమిషాలు) భూమి మీదకు దిగుతారు. మార్చి 17న రాత్రి 10.45 (అంతర్జాతీయ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30) అంతరిక్ష భూమి మీదకు ప్రయాణం ప్రారంభిస్తుందని, వీరు తిరిగి రావడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని కూడా నాసా వెల్లడించింది.
ఆదివారం ఫ్లోరిడా తీరంలో వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి నాసా, స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు సమావేశమయ్యారు. మార్చి 18న వాతావరణం అనుకూలంగా ఉన్నందును అదే రోజు క్రూ-9 మిషన్ తిరిగి రావడానికి అంగీకరించారు. ఇదే సమచారాన్ని వారికి అందించారు.
నాసా వ్యోమగాములు నిక్ హేగ్, విలియమ్స్, విల్మోర్, అలాగే రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్భునోవ్ కొన్ని సున్నితమైన ప్రయోగాల అనంతరం తిరిగి భూమిమీదకు వస్తారు. వీరు ఇప్పటికే ఒక అంతరిక్ష కక్ష్యా యానాన్ని పూర్తి చేశారు. 

డ్రాగన్ ను అన్ డాక్ చేయడం, అంతరిక్ష నౌక సంసిద్ధత, రికవరి బృందం సంసిద్దత, వాతావరణం, సముద్ర స్థితిగతులు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. మిషన్ మేనేజర్లు ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తునే ఉంటారు. క్రూ-9 రిటర్న్ కు దగ్గరగా ఉన్న నిర్ధిష్ట స్ప్లాష్ డౌన్ స్థానాన్ని నాసా, స్పేస్ ఎక్స్ నిర్ధారిస్తాయని అంతరిక్ష సంస్థ తెలిపింది.


Tags:    

Similar News