ప్లేఆఫ్స్‌కు సర్‌రైజర్స్.. ఇక పోరు ఆ జట్ల మధ్యే

మ్యాచ్ రద్దు కావడంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇప్పుడు టార్గెట్ అంతా టాప్‌2పైనే ఉంది. ఇక ఐపీఎల్‌లో రెండు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది.

Update: 2024-05-17 07:58 GMT

ఐపీఎస్ 2024 టోర్నీ మంచి పేస్‌లో సాగుతోంది. ప్రతి జట్టూ ప్రతి గేమ్‌ను అదే చివరి గేమ్ అన్నట్లు ప్రాణం పెట్టి ఆడుతున్నాయి. టోర్నీ ప్రారంభం నుంచి ప్రభంజనంలా దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిన్న వర్షం పడటంతో కష్టపడకుండానే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నిజానికి గురువారం.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ప్లేఆఫ్స్‌కు వెళ్లడానికి గుజరాత్ టీమ్‌కు ఇదే ఆఖరి అవకాశంగా కూడా ఉంది. అలాంటి సమయంలో ఊహించని విధంగా వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది. అంతే కట్ చేస్తే.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌ను కన్‌ఫామ్ చేసేసుకుంది. గుజరాత్ మాత్రం 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఆగిపోయింది.

ఇదిలా ఉంటే 4,5 స్థానాల్లో ఉన్న చెన్నై, ఢిల్లీ జట్లు 14 పాయింట్లు సాధించి ఉండగా ఆ తర్వాత స్థానంలో ఉన్న ఆర్‌సీబీ 13 పాయింట్లతో ఎలాగైనా ప్లేఆఫ్స్‌కు వెళ్లాలనే లక్ష్యంతో సాగుతుంది. అందుకు ఆర్‌సీబీ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ రేపు సీఎస్‌కేతో జరిగే మ్యాచ్. ఈ మ్యాచ్‌ను గనుగ ఆర్‌సీబీ 18 ఓవర్లలోనే ముగించి గెలిస్తే రన్‌రేట్‌తో ప్లేఆఫ్స్ వెళ్లడం పక్కా. అలా కాని పక్షంలో సీఎస్‌కే ముందుకు సాగి ప్లేఆఫ్స్‌లో ఇప్పటికే ఉన్న కేకేఆర్, రాజస్థాన్, సైన్‌రైజర్స్‌తో పాటు నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంటుంది.

టాప్‌2కి వెళ్లే అవకాశం

ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌కు రెండో స్థానానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. అదే పంజాబ్‌తో జరిగే మ్యాచ్. అందులో హైదరాబాద్ విజయం సాధిస్తే మరో రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకుని మొత్తం 17 పాయింట్లతో టాప్ 2 టయిర్‌లోకి ఎంట్రీ ఇవ్వగలుగుతుంది.

ఈ ప్లేఆఫ్స్ చాలా ప్రత్యేకం

అయితే ఈ టోర్నీలో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం సన్‌రైజర్స్‌కు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే 2020 నుంచి ఇప్పటివరకు సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేదు. 2021, 2023 టోర్నీలో సన్‌రైజర్స్ పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. 2022లో మాత్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది. అలాంటిది ఇప్పుడు మరోసారి ప్లేఆఫ్స్‌ బరిలోకి సన్‌రైజర్స్ అడుగు పెట్టింది.

Tags:    

Similar News