ఇవాళే ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్..

ఐపీఎల్ 2024 టోర్నీలో ఫైనల్‌లో బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడున్నాయి. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్..

Update: 2024-05-24 06:01 GMT

ఐపీఎల్ 2024 టోర్నీలో ఈరోజు అత్యంత కీలక మ్యాచ్ జరగనుంది. ఫైనల్‌లో బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడున్నాయి. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులు భారీగా చెన్నై చేరుకుంటున్నారు. ప్రీఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్ తలదన్నేలా రెస్పాన్స్ వస్తోంది. ఈ రెండు జట్ల అభిమానుల మధ్య కూడా ఈ టెన్షన్ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ను రెండు జట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ఒకసారి ఫైనల్ చేరే అవకాశాన్ని సన్‌రైజర్స్ చేజార్చుకుని ఉంది. దాంతో ఈసారి ఎలాగైనా ఫైనల్ బెర్త్ సాధించుకోవాలని డిసైడ్ అయింది. అదే విధంగా ఫైనల్‌కు చేరడానికి తమకు ఉన్న ఒకే ఒక్క అవకాశాన్ని ఎట్టిపరిస్థితులు చేజార్చుకోకూడదని, సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి ఫైనల్స్‌కు దూసుకెళ్లాలని రాజస్థాన్ కసరత్తులు చేసతోంది.

సన్‌‌రైజర్స్‌కు చేజారిన అవకాశం

అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని చవిచూసి ఫైనల్స్ చేరే అవకాశాన్ని ఆరెంజ్ ఆర్మీ చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 159 పరుగులకు ఆలౌట్ అయింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. సన్‌రైజర్స్ బౌలర్లను ఊచకోత కోశారు. 13.4 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి విజయం సాధించారు. ఆ రోజు మైదానంలో కేకేఆర్ వీరవిహారం కనిపించింది. అందుకు ప్రతికారం తీర్చుకోవాలని కసిగా ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు ఈ క్వాలిఫయర్ 2లో గెలవడం ఒక్కటే ఉన్న అవకాశం.

మారుతున్న జట్లు

కీలక పోరుకు సిద్ధం అవుతున్న ఎస్‌ఆర్‌హెచ్, ఆర్ఆర్ రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థిని చిత్తు చేయడానికి ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నాయి. అందులో భాగంగా తమ జట్లలో కూడా మార్పులు తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్ఆర్.. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌కు ఈసారి అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ముందుగా బౌలింగ్ చేస్తే ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని, అదే బ్యాటింగ్ చేస్తే ముగ్గురు ఓవర్‌సీస్ ఆటగాళ్లతో బరిలోకి దిగి చెలరేగాలని వచ్చే పరిస్థితులను, ఎదుర్కొనే సవాళ్లను అంచనా వేసుకుంటూ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.

ఆర్ఆర్ తుది జట్టు ఇదే

ఎస్‌ఆర్‌హెచ్ ఇంటికి పంపడానికి సిద్ధమవుతున్న ఆర్ఆర్ తుది జట్టులో యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లేర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పోవెల్/కేశవ్ మహరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు.

క్వాలిఫయర్ 2లో గెలుపే లక్ష్యంగా ఎస్‌ఆర్‌హెచ్, ఆర్ఆర్ దూసుకెళ్తున్నాయి. ఒకరిని మించి మరొకరు వ్యూహాలు రచిస్తున్నారు. దానికి తోడు ఈ మ్యాచ్‌కు వేదిక కానున్న చెన్నై చెపాక్ స్టేడియంలో ఇరు జట్లు రికార్డులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే ఈ క్వాలిఫయర్ 2 అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా మారనుందని అందరూ భావిస్తున్నారు.

Tags:    

Similar News