రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ప్రమాణ స్వీకారం

సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆమెతో స్పీకర్ జగదీప్ ధన్‌కర్ ప్రమాణం చేయించారు.

Update: 2024-04-04 17:27 GMT

రాజ్యసభ సభ్యులుగా గురువారం (ఏప్రిల్ 4) ప్రమాణం చేసిన 14 మందిలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఉపాధ్యక్షుడు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ వారితో ప్రమాణం చేయించారు. రాజస్థాన్‌ నుంచి సోనియాగాంధీ ఎగువసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఒడిశా నుంచి వైష్ణవ్, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ నేత ఆర్పీఎన్ సింగ్, పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ సభ్యుడు సమిక్ భట్టాచార్య సహా 14 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు గోల బాబురావు, మేడా రఘునాథ్‌రెడ్డి, ఏరు వెంకట్‌ సుబ్బారెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారంతా రాజ్యసభ చైర్మన్‌తో గ్రూప్‌ ఫొటో దిగారు.

మొదటిసారి రాజ్యసభ సభ్యురాలిగా..

సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభ సభ్యురాలయ్యారు. సభా నాయకుడు పీయూష్ గోయల్, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, సెక్రటరీ జనరల్ పీసీ మోదీ కూడా హాజరయ్యారు.


Tags:    

Similar News