ఇంజనీరింగ్ వదిలి వేయాలని చెప్పినందుకు తల్లిదండ్రుల హత్య

మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగిన సంఘటన;

Update: 2025-01-02 09:36 GMT

‘ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యావ్.. దాన్ని వదిలేయ్’ అని కోరినందుకు తల్లిదండ్రులను చంపేశాడో దుర్మార్గుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నాగ్ పూర్ లో జరిగింది. తన తల్లిదండ్రుల కోరికపై కలత చెందిన నిందితుడు ఉత్కర్ష్ ధాఖలే మొదట తన తల్లి అరుణ (50) ని గొంతు కోసి చంపాడు. రెండు గంటల తరవాత పని ముగించుకుని ఇంటికి వచ్చిన తండ్రి లాలాధర్ (55) ని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన డిసెంబర్ 26 న జరిగింది. అయితే వారి మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టాడు. అమ్మనాన్నలు ఏమయ్యారని సోదరి అడగగా తీర్థయాత్రలకు వెళ్లారని అబద్దం చెప్పాడు.
ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని పక్కన ఉన్నవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేరం బయటకు వచ్చిందని పోలీసులు చెప్పారు. కళ్లి పోయిన మృతదేహాలను వెలికి తీసిన తరువాత ఉత్కర్ష్ ను అరెస్ట్ చేసి, విచారణ చేయగా తల్లిదండ్రులు చంపినట్లు అంగీకరించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నికేతన్ కదమ్ మీడియాకు తెలిపారు. ఆయన తండ్రి లాలాధర్ సామాజిక కార్యకర్త, పవర్ ప్లాంట్ టెక్నీషియన్.
చదువులో వెనకంజ..
ఉత్కర్ష్ చదువులో చాలా వెనకబడి ఉన్నాడని అతని విద్యా రికార్డులు చూస్తే తెలుస్తోంది. చదువు సరిగా సాగపోవడంతో కెరీర్ ముందుకు సాగలేదని అధికారులు తెలిపారు. ‘ ఉత్కర్ష్ ఇంజనీరింగ్ కోర్సులో అనేక సబ్జెక్ట్ ల్లో ఫెయిల్ అయ్యాడు. అతని తల్లిదండ్రులు అతను ఇంజనీరింగ్ వదిలివేసి వేరేదాన్ని ఎంచుకోవాలని చెప్పారు.
అయితే వారి సూచనలను ఉత్కర్ష్ పట్టించుకోలేదు. వారు అతనిపై బలవంతంగా ఒత్తిడి చేశారు. ’’ అని కదమ్ చెప్పారు. తండ్రిని కత్తితో పొడిచిన తరువాత కూడా వాదనకు దిగాడని, తన తల్లితో ఈ సమస్య గురించి మాట్లాడతానని చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అయితే తండ్రిని చంపడానికంటే ముందే అతను తల్లిని చంపి మృతదేహాన్ని దాచి పెట్టాడు.
అనేక అబద్ధాలు...
ఇంజనీరింగ్ వదిలి పెట్టి వేరు కోర్సు చదవాలని తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. వారి హత్య తరువాత తన సోదరిని కాలేజ్ నుంచి వచ్చిన తరువాత మేనమామ నివాసానికి తీసుకెళ్లాడు. ఇద్దరు అక్కడే ఉన్నారు. తరువాత తండ్రికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇద్దరు మెడిటేషన్ లో ఉండవచ్చని, అందుకే ఫోన్ స్విచ్ అయినట్లు ఆమెకు అబద్దం చెప్పాడు.


Tags:    

Similar News