చంద్రుడిపై గుహలు.. మానవ ఆవాసాలుగా మారనున్నాయా?

చంద్రుడిపై గుహలు ఉన్నాయని ఇటలీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికా ప్రయోగించిన అపోల్ మిషన్ కు కాస్త దూరంలో ఇవి ఉన్నాయని తెలిపారు. ఇవి మానవ ఆవాసాలుగా..

Update: 2024-07-16 07:25 GMT

చంద్రుడిపై మానవ ఆవాసాలకు సరైన ప్రదేశం దొరికిందా? అక్కడి నుంచి అంతరిక్ష ప్రయోగాలు చేయడం సాధ్యపడుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రుడి మీద తొలిసారిగా కాలుమోపిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యాండ్ అయిన అపోల్ మిషన్ కు దగ్గరలోనే ఓ గుహ ఉన్నట్లు ఖగోళ పరిశోధకులు గుర్తించారు.

ఇది అంతరిక్ష యాత్రికులకు నిజంగా శుభవార్తగా పరిశోధకులు చెబుతున్నారు. ఇటాలియన్ నేతృత్వంలోని బృందం సోమవారం (జూలై 15) దీనికి సంబంధించిన వివరాలు బయటకు వెల్లడించింది. వందలాది మంది వ్యోమగాములు అందులో నివాసం ఉండటానికి అవకాశం ఉందని చెబుతోంది.

ఒక లోతైన బిలం నుంచి ఈ గుహను చేరుకోవడానికి మార్గం ఉందని వారు చెబుతున్నారు. ఇది అపోలో 11 ల్యాండింగ్ సైట్ నుంచి కేవలం 250 మైళ్ళు (400 కిమీ) దూరంలో ఉంది. ఇందులో 200 కంటే ఎక్కువ మంది వ్యోమగాములను సదుపాయాలు కలిపించే అవకాశం కనిపిస్తోంది. ఇది చంద్రుడి పై ప్రవహించిన లావా ట్యూబ్ కూలిపోవడం ద్వారా ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పరిశోధకులు నాసా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ ద్వారా రాడార్ కొలతలను విశ్లేషించారు. ఆ ఫలితాలను భూమిపై ఉన్న లావా ట్యూబ్‌లతో సరిపోల్చారు. వారి పరిశోధనలు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.
చంద్ర గుహల రహస్యం
శాస్త్రవేత్తల ప్రకారం, రాడార్ డేటా భూగర్భ కుహరం ప్రారంభ భాగాన్ని మాత్రమే వెల్లడిస్తుంది. ఇది కనీసం 130 అడుగుల (40 మీటర్లు) వెడల్పు పదుల గజాల (మీటర్లు) పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు, బహుశా అంతకంటే ఎక్కువే ఉండే అవకాశం కనిపిస్తోంది.
"చంద్ర గుహలు 50 సంవత్సరాలుగా రహస్యంగా ఉన్నాయి. ఎట్టకేలకు వాటి ఉనికిని నిరూపించడం చాలా ఆనందం కలిగిస్తోంది, ” అని ట్రెంటో విశ్వవిద్యాలయానికి చెందిన లియోనార్డో కారెర్, లోరెంజో బ్రూజోన్ ఒక ఇమెయిల్‌లో హర్షం వ్యక్తం చేశారు.
శాస్త్రవేత్తల ప్రకారం, చాలా బిలాలు చంద్రుని పురాతన లావా మైదానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రుని దక్షిణ ధృవం వద్ద కూడా కొన్ని ఉండవచ్చు. అమెరికా ప్రస్తుతం ఇక్కడ మానవులను ఇక్కడ దింపడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ ఉన్న క్రేటర్స్ మంచుతో కూడిన నీరు, ఇంధనం నిల్వలతో ఉండే అవకాశం ఉందని నాసా అంచనా వేస్తోంది.
అక్కడ శాశ్వతంగా నీడ ఉన్న క్రేటర్స్ తాగునీటికి,రాకెట్ ఇంధనాన్ని అందించగల శక్తిని కలిగి ఉన్నాయని నమ్ముతున్నారు. NASA అపోలో కార్యక్రమంలో, జూలై 20, 1969న ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్‌లతో ప్రారంభించి 12 మంది వ్యోమగాములు చంద్రునిపై అడుగుపెట్టారు.
చంద్రునిపై వందల కొద్దీ క్రేటర్స్, వేల లావా ట్యూబ్‌లు ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అటువంటి ప్రదేశాలు వ్యోమగాములకు సహజ ఆశ్రయం వలె ఉపయోగపడతాయి, కాస్మిక్ కిరణాలు, సౌర వికిరణం నుంచి అలాగే మైక్రోమీటోరైట్ దాడుల నుంచి వారిని కాపాడే సహాజ ఆవాసాలుగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
చంద్రుడిపై నివాసాలు నిర్మించాలని అనేక సంస్థలు చాలా సంవత్సరాలుగా ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఎక్కువ సమయం, అక్కడి పరిసరాలు సవాల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. బదులుగా గుహాలను ఉపయోగించి, వాటిని పటిష్టం చేయడం ద్వారా మానవ ఆవాసాలను నిర్మించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్న మాట.
ఈ గుహలలోని రాళ్ళు- ఇతర పదార్థాలు శాస్త్రవేత్తలకు బాగా ఉపయోగపడతాయి. అగ్నిపర్వత కార్యకలాపాలు, చంద్రుడు ఎలా ఉద్భవించాడో తెలుసుకోవడం లో సాయపడతాయి.
Tags:    

Similar News