కోవిడ్ సర్టిఫికేట్ నుంచి మోదీ ఫొటో తొలగింపు.. కారణం అదే..
అవును.. మీరు విన్నది నిజమే.. కోవిడ్ సర్టిఫికెట్ మీద ప్రధాని మోదీ బొమ్మను తొలగించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండడమే అందుకు కారణం..
Update: 2024-05-02 06:52 GMT
మీకు గుర్తుందా.. మనం గతంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత డౌన్ లోడ్ చేసుకున్న సర్టిఫికేట్ మీద ప్రధాని మోదీ బొమ్మ కనిపించేంది. అయితే ఇప్పుడు అదే సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసి చూడండి. ఆయన బొమ్మ కనిపించదు. కోవిడ్ సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటో అదృశ్యమైందని, కేవలం క్యూఆర్ కోడ్ మాత్రమే వస్తుందని కొందరు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టడంతో అది కాస్త వైరలయ్యింది.
కాగా ఎన్నికలు వేళ రాజకీయ నాయకుల చిత్రాలు జనానికి కనిపించకుండా ఉంచడం సాధారణమే. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల నుంచి ప్రధాని మోదీ ఫొటోలను తొలగించడం కూడా అందులో భాగమే. గతంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సమయంలోనూ ప్రధాని ఫొటోను కోవిన్ పోర్టల్‌లో తొలగించడం గమనార్హం.
Modi ji no more visible on Covid Vaccine certificates
— Sandeep Manudhane (@sandeep_PT) May 1, 2024
Just downloaded to check - yes, his pic is gone 😂#Covishield #vaccineSideEffects #Nomorepicture #CovidVaccines pic.twitter.com/nvvnI9ZqvC
“COVID వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లో మోడీ జీ ఇక కనిపించరు. కావాలంటే ఇప్పుడే సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసి చూడండి’’ అని అని సందీప్ మనుధనే అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన పెట్టిన పోస్టుపై చాలా మంది స్పందించారు. అరె..ప్రధానమంత్రి ఫోటో నిజంగా కనిపించకుండా పోయిందని కామెంట్ పెట్టారు. ఈ పోస్టు కాస్త వైరల్ కావడంతో మరో ఎక్స్ వినియోగదారుడు అజయ్ రోట్టి ఇలా పోస్టు చేశారు.
“అయ్యా, మీరు చూసింది నిజమే. మోదీ ఫొటో కనిపించడం లేదు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ECI మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని మోదీ ఫోటో తీసివేయడం జరిగింది’’. అని రిప్లై చేశాడు.
మరో ఎక్స్ వినియోగదారుడు..గతంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈసీ ఆదేశాల మేరకు మోదీ ఫొటోను తొలగించారని గుర్తు చేశారు.
తాజా గందరగోళంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించించి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను దృష్టిలో ఉంచుకుని ఫోటోను తొలగించినట్లు క్లారిటీ ఇచ్చింది.