ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత

ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం కన్నుమూశారు. మీడియా మొఘల్ గా పేరొందిన రామోజీరావు పార్థీవదేహాన్ని ఫిలింసిటీకి తరలిస్తున్నారు.

By :  Admin
Update: 2024-06-08 02:12 GMT

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఈ నెల 5వతేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో అతన్ని హైదరాబాద్ నగరంలోని స్టార్ హాస్పిటల్ కు తరలించారు. ఈ తెల్లవారు జామున ఆయన మరణించారు.

- ఇటీవలే గుండె సంబంధిత వ్యాధితో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. వెంటిలేటర్ పై ఉంచి వైద్య చికిత్స అందిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి రామోజీరావు కన్నుమూశారని వైద్యులు చెప్పారు. వయస్సు రీత్యా పలు ఆరోగ్య సమస్యలతో రామోజీరావు మరణించారని వైద్యులు వివరించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలింసిటీకి తరలిస్తున్నారు.

రామోజీరావు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు.

ఎన్నెన్నో సంస్థలు...

ఈనాడు, ఈటీవీతోపాటు పలు వ్యాపార సంస్థలను నెలకొల్పిన రామోజీరావు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తగా, మీడియా మొఘల్ గా పేరొందారు. మార్గదర్శి ఛిట్ ఫండ్, రామోజీ ఫిలింసిటీ, ప్రియా పచ్చళ్లు, ఉషా కిరణ్ మూవీస్ ఇలా పలు సంస్థలను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించారు.

సంతాపం తెలిపిన ప్రముఖులు

తెలుగు మీడియా ప్రపంచంలో వెలుగులు నింపిన ధీరుడు. ఈనాడు గ్రూప్ కు ఆరంభం ‘ఈనాడు’ దినపత్రిక. ఇది 1974 లో విశాఖ పట్నంనుంచి మొదలయింది. ఆకారం, పేరు , వార్తలు, భాష టెక్నాలజీ, పంపిణీ అన్నింటిలోను కొత్త పుంతలు తొక్కి తెలుగు జర్నలిజంలో నవశకానికి నాంది పలికిన పత్రిక ఈనాడు. ఈ పత్రిక ద్వారా వార్తలు వేగంగా అందిస్తూ జిల్లా పత్రికలతో అందరికీ ఆదర్శింగా నిలిచారు.రామోజీ ఫిల్మ్ సిటీ, ఈటీవీ నెట్‌వర్క్ ఆయన సృజనాత్మకతకు నిలువెత్తు సాక్ష్యం.

ఎమర్జీన్సీ తర్వాతి రోజుల్లో తెలుగు జర్నలిజంలో లాగానే, తెలుగు రాజకీయాలను కూడా ఈనాడు పత్రిక శాసించింది పత్రికకు కాంగ్రెస్ వ్యతిరేక సైద్ధాంతిక పునాది వేసి నడిపించిన రామోజీరావు మృతి పట్లపలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ హైదరాబాద్ లో అవతరించిందిద. 2016లో భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ తో సత్కరించింది.

రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని పలువురు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.


Tags:    

Similar News