నీట్: ర్యాంక్ లను సవరించిన ఎన్టీఏ

నీట్ పేపర్ లీక్ విషయంలో ఓ వైపు దర్యాప్తు జరుగుతుండగానే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 15 వందల మందికి కొత్తగా పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ, సవరించిన ర్యాంకులను..

Update: 2024-07-01 04:50 GMT

నీట్ పేపర్ లీక్ తరువాత ఎన్టీఏ ఆదివారం 1563 మంది అభ్యర్థులకు నిర్వహించిన పరీక్ష రివైజ్డ్ ఫలితాలు, అభ్యర్థులందరి ర్యాంక్ ల సవరించి మరోసారి ప్రకటించింది. జూన్ 13, 2024 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, జూన్ 23, 2024న 1,563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించామని, అందులో మొత్తం 813 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఏజెన్సీ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన పబ్లిక్ నోటీసులో పేర్కొంది.

పునఃపరీక్ష తర్వాత, 813 మంది అభ్యర్థుల తాత్కాలిక సమాధానాల ‘కీ’లు, స్కాన్ చేసిన జవాబు పత్రాల కాపీని జూన్ 28, 2024న పబ్లిక్ నోటీసు ద్వారా ప్రదర్శించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థుల తమను సంప్రదించాలని ప్రకటించింది. ఇలా అభ్యర్థుల నుంచి వచ్చిన సవాళ్లను నిపుణులు స్వీకరించి పరిష్కరించారు. కీల ప్రకారం ప్రాసెస్ చేశారని నీట్ తెలిపింది.
NEET (UG) 2024 అభ్యర్థులందరి సవరించిన స్కోర్ కార్డ్‌లు వెబ్‌సైట్‌లో ( https://exams.nta.ac.in/NEET/ ) పోస్టు చేయబడుతున్నాయని NTA ప్రకటించింది.
అభ్యర్థులు వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి, సంబంధిత రివైజ్డ్ స్కోర్ కార్డ్‌లను వీక్షించవచ్చు/డౌన్‌లోడ్ చేసుకోవచ్చు/ప్రింట్ చేయవచ్చు అని టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.



Tags:    

Similar News