గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడని..రైలులో వృద్ధుడిపై దాడి.

గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడనే అనుమానంతో ఓ వృద్ధుడిని తోటి ప్రయాణికులు దుర్భాషలాడి గాయపర్చిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటుచేసుకుంది.

Update: 2024-09-01 08:56 GMT

గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడనే అనుమానంతో ఓ వృద్ధుడిని తోటి ప్రయాణికులు దుర్భాషలాడి గాయపర్చిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటుచేసుకుంది.

జల్గావ్‌ నివాసి అయిన అష్రఫ్ మున్యార్.. మాలేగావ్‌లోని తన కూతురు ఇంటికి చేరుకోవాలని ధులే ఎక్స్‌ప్రెస్‌ ట్రయిన్ ఎక్కాడు. వెంట తెచ్చుకున్న రెండు ప్లాస్టిక్ డబ్బాలను చూసిన బోగీలోని ఓ ప్రయాణికుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అష్రఫ్‌ను అడిగారు? డబ్బాల్లో ఏం తీసుకెళ్తున్నావని ప్రశ్నించాడు. కూతురి ఇంటికి బయల్దేరానని, డబ్బాల్లో మాంసం ఉందని సమాధానమిచ్చాడు అష్రఫ్. ఇది మేక మాంసం..గొడ్డు మాంసం కాదని చెబుతున్నా..డబ్బాల్లో ఉన్నది గొడ్డు మాంసమేనని మరో ప్రయాణికుడు అష్రఫ్‌పై చేయిచేసుకున్నాడు. ఈ ఘటనను కొందరు తమ సెల్ ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో కాస్తా వైరలయ్యింది. మహారాష్ట్ర జంతు సంరక్షణ చట్టం 1976 ప్రకారం ఆవులు, ఎద్దులు, ఎద్దులను వధించడం నిషేధం.

ప్రతిపక్షాల విమర్శలు..

రైలు బోగిలో వృద్ధుడి పట్ల కొందరు దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో ఘటనపై ఔరంగాబాద్ AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇలాంటి దాడులను జనం ప్రతిఘటించాలి.’’ అని ఎక్స్‌లో పోస్టు చేశాడు.

ప్రతిపక్షాలు ఏకనాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. రాష్ట్రంలో శాంతిభ్రదతలు క్షీణించాయని ఆరోపించాయి.

"కొందరు యువకులు గొడ్డు మాంసం తీసుకువెళుతున్నాడని మునలాయ్యను కొట్టారు. ఇది మహారాష్ట్ర కాదు. మన సంస్కృతి కాదు. ఇది ఎక్కడ ఆగుతుంది’’ అని ఎన్సీపీ (శరద్ పవార్) నేత జితేంద్ర అవద్ వ్యాఖ్యానించారు.

“మహారాష్ట్రలో 80 శాతం మంది మాంసాహారులు. కోస్తా తీరంలో 95 శాతం మంది మాంసాహారం తీసుకుంటారు. మేము అన్ని మతాలను గౌరవిస్తాము. కానీ ప్రజలను కొట్టడం ఏమిటి? కొట్టిన వాళ్లకు సిగ్గుండాలి. వాళ్ల నాన్నవయసు ఉన్న పెద్దమనిషిని కొట్టడం ఏమిటి? ’’అని ప్రశ్నించారు.

నిందితులను అరెస్టు చేస్తాం.

కాగా ఈ ఘటనను రైల్వే పోలీసులు ధృవీకరించారు.ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. అష్రఫ్ పట్ట దురుసుగా ప్రవర్తించిన ధులే నివాసితులైన ఇద్దరు నిందితులను గుర్తించారని, వారి కోసం ఒక బృందాన్ని ధులేకు పంపామని చెప్పారు.

Tags:    

Similar News