ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై నర్సింగ్ కౌన్సిల్ ఆగ్రహం
ఐదుగురు విద్యార్థులపై నర్సింగ్ చేయకుండా నిషేధం;
By : Praveen Chepyala
Update: 2025-02-17 08:40 GMT
కేరళలోని నర్సింగ్ కళాశాలలో విద్యార్థులను నీచంగా ర్యాగింగ్ చేసిన ఐదురుగు సీనియర్ విద్యార్థులపై వారి చదువు కొనసాగించకుండా నిషేధం విధిస్తూ కేరళ నర్సులు, మిడ్ వైవ్స్ కౌన్సిల్ నిర్ణయించింది.
నిందితులందరూ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నారు. దీనిపై ఓ కౌన్సిల్ సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘ఇది చాలా క్రూరమైనది’’ అని అభివర్ణించారు. ఇటువంటి చర్యలు సభ్యసమాజం ఆమోదించదని అన్నారు.
మరో కౌన్సిల్ సభ్యులు ఉషా దేవీ మాట్లాడుతూ.. ఈ సంఘటనలు మేము అసలు సమర్థించము. అలాంటి వ్యక్తులను నర్సింగ్ వృత్తిలోకి అనుమతించడం విపత్తుకు దారి తీస్తుంది’’ అన్నారు.
ప్రాథమిక దర్యాప్తు
‘‘జిల్లా ఆరోగ్య సేవల(డీహెచ్ఎస్) ద్వారా మా నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాము. ఇది కళాశాల అధికారులకు కూడా తెలియజేస్తాం’’ అని ఆమె చెప్పారు. నిందితులపై కఠిక చర్యలు తీసుకుంటామని కేరళ ఆరోగ్యమంత్రి హమీ ఇచ్చిన ఒక రోజు తరువాత కౌన్సిల్ తీర్పు వెలువడింది.
ఆరోగ్య మంత్రి వీణా గెరోగే ఆదేశాల మేరకు వైద్య, విద్య డైరెక్టరేట్ ప్రాథమిక విచారణ నిర్వహించింది. హస్టల్ ఇన్ చార్జ్ గా ఉన్న ప్రిన్సిపల్ సులేఖ ఎటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అజీష్ పి మణిని సస్పెండ్ చేశారు. ఆసుపత్రి హౌజ్ కీపర్ కమ్ సెక్యూరిటీ సిబ్బందిని సైతం వెంటనే తొలగించాలని ఆదేశించారు.
కత్తులు స్వాధీనం..
నిందితులు తమ చేతుల్లో ర్యాగింగ్ పాల్పడ్డారని మరిన్ని విద్యార్థులు కథనాలు బయటకు వస్తున్నాయని పోలీసులు తెలిపారు. సీనియర్ విద్యార్థుల వసతి గృహాల్లో కత్తులు, రాళ్లు దొరికాయని పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి ఐదుగురు మూడో సంవత్సరం విద్యార్థులు సామ్యూల్ జాన్సన్(20), రాహుల్ రాజ్(22), జీవ్ (18), రిజిల్ జిత్(20), వివేక్(21) అరెస్ట్ అయ్యారు.