‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడికి బెయిల్
దేశంలో చైనా అనుకూల వార్తలు ప్రచారం చేయడానికి డబ్బులు తీసుకుంటున్నాడనే ఆరోపణలపై అరెస్ట్ చేయబడిన న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ..
భారత్ లో చైనా అనుకూల ప్రచారం చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను ఢిల్లీ పోలీసులు గత ఏడాది అరెస్ట్ చేశారు. అతనిపై యూఏపీఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మే 6న, న్యూస్‌క్లిక్ మానవ వనరుల విభాగం(హెచ్ ఆర్) చీఫ్ అమిత్ చక్రవర్తిని కస్టడీ నుంచి విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
గత ఏడాది అక్టోబర్ 3న ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం పుర్కాయస్థ, చక్రవర్తిలను అరెస్టు చేసింది. పుర్కాయస్థ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీ పోలీసుల FIR ప్రకారం, "భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించడానికి" దేశంపై ప్రజలలో అసంతృప్తిని కలిగించడానికి చైనా నుంచి న్యూస్ పోర్టల్‌కు పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయని ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.