Bangladesh | ఇస్కాన్ కేంద్రాన్ని తగులపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నమ్‌హట్టా కేంద్రం కాలిపోయింది. లక్ష్మీ నారాయణ దేవతా విగ్రహాలు, ఆలయంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.

Update: 2024-12-07 10:46 GMT

బంగ్లాదేశ్‌ ఢాకా జిల్లాలోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) కేంద్రాన్ని శనివారం గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ ఘటనపై ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ పీటీఐతో మాట్లాడుతూ..ఇస్కాన్ ప్రచారకులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిరంతరంగా కొనసాగుతున్నాయన్నారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత నాలుగు నెలల్లో బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో ఇస్కాన్ ఆస్తులను ధ్వంసం చేశారని, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం దాడుల నివారణకు ఏ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. హింసాత్మక దాడుల తరువాత అరెస్టయిన ప్రచారకుడు చిన్మోయ్ కృష్ణ దాస్ భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

“బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నమ్‌హట్టా కేంద్రం కాలిపోయింది. లక్ష్మీ నారాయణు దేవతా విగ్రహాలు ఆలయంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. శనివారం తెల్లవారుజామున 2 -3 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. ఆలయం వెనుక భాగంలో ఉన్న టిన్ రూఫ్‌ని పైకి లేపి పెట్రోల్‌ పోసి తగులపెట్టారు.” అని రాధారామన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు.

Tags:    

Similar News