జర్నలిస్ట్ ముఖేష్ హత్య ఇంత భయానకంగా జరిగిందా..!

ఛత్తీగఢ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, యూట్యూబర్ ముఖేష్ చంద్రకర్ హత్య ఘటన దేవవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.;

Update: 2025-01-06 08:39 GMT

ఛత్తీగఢ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, యూట్యూబర్ ముఖేష్ చంద్రకర్ హత్య ఘటన దేవవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విషయంలో రోజుకో కీలక అంశంపై వెలుగు చూస్తోంది. లిక్కర్ అమ్మకం, మెకానిక్‌గా పనిచేయడం నుంచి జర్నలిస్ట్‌గా యూట్యూబర్‌గా ముఖేష్ జీవితం ప్రారంభమైంది. జర్నలిజంపై ఉన్న ఆసక్తితో ఎన్నో అంశాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అదే విధంగా ముఖేష్ బట్టబయలు చేసిన ఒక రిపోర్ట్ అతడి మరణశాసనమైంది. సొంత బంధువే అతడిని హతమర్చేలా చేసింది. అదే రూ.120కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లో జరిగిన అవినీతి అంశం. దీనిని బయటపెట్టినందుకే ముఖేష్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చారు. అతడిని అత్యంత దారుణంగా కొట్టి, గుండెకు బయటకు తీసి చంపేసినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ పేర్కొంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో కీలక నిందితుడైన సురేష్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. వృత్తిరీత్య కాంట్రాక్టర్ అయిన నిందితుడు ఈ ఏడాది జనవరి 3న జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్‌ను హత్య చేసి పరారయ్యాడు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్.. ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుని సురేంద్ర చంద్రాకర్‌ను అదుపులోకి తీసుకుంటున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. ఆయన సోదరులు రితేష్ చంద్రకర్, దినేష్ చంద్రకర్, వారి సూపర్ వైజర్ మహేంద్ర రామ్ టేకేలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

సెప్టిక్ ట్యాంక్‌లో లభ్యమైన ముఖేష్ మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇందులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగు చూశాయి. ముఖేష్ కాలేజం నాలుగు ముక్కలైందని, పక్కటెముకలు ఐదు చోట్ల, తలపై 15 ప్రదేశాల్లో ఎముకలు విరిగిపోయాయని వైద్యులు తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా అతడి ఛాతీని చీల్చి గుండెను బయటకు తీశారని, తమ కెరీర్‌లో ఇంతటి భయానకమైన హత్యను ఎన్నడూ చూడలేదని వైద్యులు వెల్లడించారు. ముఖేష్‌ను హతమార్చడంలో ఇద్దరి కంటే ఎక్కువమందే పాల్గొన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు వైద్యులు.

జర్నలిజంపై ఉన్న ప్యాషన్‌తో ఫ్రీలాన్సర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ముఖేష్.. బస్తర్‌లో గంగూరు నుంచి హిరోలి వరకు రూ.120కోట్ల వ్యవయంతో చేపట్టిన రోడ్డు ప్రాజెక్ట్‌పై కథనం వెలువరిచారు. ఈ ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని, తొలుత రూ.50కోట్లతో చేపట్టిన టెండర్ పూర్తిస్థాయి అభివృద్ధి జరగపోయినా రూ.120కోట్లకు చేరిందని కథనం విడుదల చేశారు. ఆ వీడియో విడుదలైన తర్వాత ముఖేష్ కనుమరుగైపోయారు. అతని ఏం జరిగిందని అందరిలో అనుమానం రేకెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు. కాగా చివరకు తన ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ముఖేష్ మృతదేహం లభ్యమైంది. పచ్చబొట్టు ఆధారంగా ఆ మృతదేహం ముఖేష్‌దే అని కుటుంబీకులు గుర్తించారు.

అయితే జర్నలిస్ట్ ముఖేష్‌కు, అతడికి సోదరుడి వరుసయ్యే రితీష్, సూపర్‌వైజర్ మహేంద్రకు కలిసి భోజనం చేసే సమయంలో ఈ అవినీతి వార్త విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో ఒక్కటైన రితీష్, మహేంద్ర తొలుగ ఇనుప రాడ్డుతో ముఖేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. దాంతో ముఖేష్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం అతడి మృతదేహాన్ని మహేంద్ర పర్యవేక్షణలో సెప్టిక్ ట్యాంక్‌లో వేసి దానిని సిమెంటుతో పూడ్చివేశారు. ఆ తర్వాత ముఖేష్ ఫోన్‌, దాడికి వినియోగించిన ఇనుప రాడ్డును పారేశారు నిందితులు.

హైదరాబాద్‌లో నిందితుడి అరెస్ట్

ముఖేష్ హత్య జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సురేష్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ముఖేష్ హతమార్చిన తర్వాత పరారయిన సురేష్.. హైదరాబాద్‌లోని తన డ్రైవర్ ఇంట్లో దాక్కున్నాడని పోలీసులు తెలిపారు. సురేష్ ఆచూకి తెలుసుకోవడం 300 మొబైల్ నెంబర్లు, 200 సీసీటీవీ వీడియోలను పరిశీలించామని, అతడిని తిరిగి ఛత్తీస్‌గఢ్‌కు తరలించనున్నామని పోలీసులు వివరించారు. ఇప్పటికే సురేష్‌కు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు పోలీసులు.

Tags:    

Similar News