‘1971 నాటి చేదు జ్ఞాపకాలను మరిచిపోదాం’
పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ముందు ప్రతిపాదించిన మహ్మద్ యూనస్
By : 491
Update: 2024-12-20 12:10 GMT
బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంగా పాకిస్తాన్ తో ఏర్పడిన చేదు జ్ఞాపకాలను అధిగమించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని బంగ్లాదేశ్ తాత్కలిక పాలకుడు మహ్మద్ యూనస్ అన్నారు.
ఈజిప్జు రాజధాని కైరోలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ను కలిశాడు. ఈ ఇద్దరు కలిసిన ఫొటోను ఆయన ఎక్స్ లో పోస్టు చేసిన అనంతరం మాట్లాడారు. "ద్వైపాక్షిక - బహుపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలనే మా నిబద్ధతను మేము సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, క్రీడలు, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అంగీకరించారని యూనస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
'1971 సమస్యలను పరిష్కరిద్దాం'
బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్ తూర్పు భాగంగా ఉండేది. అయితే ముజిబుర్ రెహ్మన్ ఎన్నికల్లో గెలిచిన తరువాత పశ్చిమ పాకిస్తాన్( నేటీ పాకిస్తాన్) అధికార బదిలీ ఇవ్వడానికి నిరాకరించి, బెంగాలీ ముస్లింలపైకి దాడులకు దిగింది. లక్షలాది మంది మహిళలను బలత్కారం చేసింది. తరువాత ఢాకాలో ఏర్పడిన ముక్తిబాహిని స్వాత్రంత్య్ర సైన్యానికి భారత్ సాయం చేసింది.
తరువాత ఇస్లామాబాద్ సైనిక దాడికి దిగడతో భారత్ 13 రోజులు యుద్ధం చేసింది. 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు పట్టుబడటంతో ఓటమి ఒప్పంద పత్రం పై పాకిస్తాన్ సంతకం చేసింది. తరువాత బంగ్లాదేశ్ అధికారికంగా ఏర్పడింది.
అసాధారణ రక్తపాతంలో విడిపోయాం..
ఇస్లామాబాద్ నుంచి ఢాకా అపారమైన రక్తపాతంతో కూడిన యుద్దంతో విడదీయబడింది. అప్పుడు ఏర్పడిన అనేక సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని మహ్మద్ యూనస్ అన్నారు. "సమస్యలు పదే పదే వస్తూనే ఉన్నాయి" అని యూనస్, షరీఫ్‌తో అన్నారు. "మనం ముందుకు సాగడానికి ఆ సమస్యలను పరిష్కరించుకుందాం." అని ప్రతిపాదించారు.
సార్క్‌ను పునరుద్ధరణ
డి-8 ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ శిఖరాగ్ర సమావేశం కైరోలో జరిగింది. ఇందులో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎనిమిది దేశాలతో కూడిన సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కో ఆపరేషన్ ను తిరిగి పునరుద్దరించాలనుకుంటున్నట్లు యూనస్ తెలిపారు.
"ఇది అత్యంత ప్రాధాన్యత" అని యూనస్ అన్నారు. " కనీసం ఫోటో సెషన్ కోసం మాత్రమే అయినా సార్క్ నాయకుల శిఖరాగ్ర సమావేశం కావాలి, ఎందుకంటే అది బలమైన సందేశాన్ని కలిగి ఉంటుంది".
మెరుగైన సంబంధాల కోసం..
బంగ్లా తాత్కలిక అధినేత మహ్మద్ యూనస్ తో స్నేహ పూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చెప్పారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన సరుకులను 100 శాతం భౌతిక తనిఖీని మినహాయించినందుకు, ఢాకా విమానాశ్రయంలో పాకిస్థానీ ప్రయాణీకులను పరిశీలించడానికి ఉద్దేశించిన ప్రత్యేక భద్రతా డెస్క్‌ను రద్దు చేసినందుకు షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఉన్నత స్థాయి బంగ్లాదేశ్-పాకిస్తాన్ పరిచయాలు
పాకిస్థానీ వీసా దరఖాస్తుదారులకు అదనపు క్లియరెన్స్ అవసరాలను తొలగించినందుకు యూనస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు నాయకులు "ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవలి సానుకూల పరిణామాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు . "పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు నేరుగా ప్రయాణించిన మొదటి కార్గో షిప్ చిట్టగాంగ్ ఓడరేవులో దాని కంటైనర్‌లను విజయవంతంగా అన్‌లోడ్ చేసింది. దాదాపు దశాబ్ధం తరువాత పాకిస్తాన్ నుంచి ఓ కంటైనర్ బంగ్లాదేశ్ చేరింది.