వక్భ్ బిల్లు: ఐదు వందలకు పైగా సవరణలు..
ఈ రోజు క్లాజుల వారీగా చర్చించనున్న కమిటీ;
By : Praveen Chepyala
Update: 2025-01-27 09:22 GMT
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీలోని మెంబర్లు దాదాపు 572 సవరణలు ప్రతిపాదించారు. ఇప్పటికే ఈ బిల్లుపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. జేపీసీ నుంచి ప్రతిపక్షానికి చెందిన పదిమంది ఎంపీలను సస్పెండ్ చేసి తరువాత ప్యానెల్ సభ్యులు సమావేశం అయ్యారు.
ప్యానెల్ విచారణ చివరి ఘట్టంలోని ప్రవేశించడంతో ఆదివారం అర్థరాత్రి బీజేపీ నేత జగదాంబిక పాల్ అధ్యక్షతన వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ కమిటీ సవవరణల ఏకీకృత జాబితాను విడుదల చేసింది. సోమవారం జరిగే సమావేశంలో ఈ సవరణలను క్లాజ్ ల వారీగా కమిటీ సవివరంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఇందులో బీజేపీ సభ్యులతో పాటు, ప్రతిపక్ష సభ్యులు కూడా సవరణలు సమర్పించారు. అయితే ఆశ్చర్యకరంగా ఇందులో బీజేపీ మిత్ర పక్షాల నుంచి ఎటువంటి సవరణలు ప్రతిపాదించలేదు.
దేశంలో వక్ఫ్ బోర్డ్ చేస్తున్న అరాచకాలపై కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లు-2024 ను కేంద్ర మైనారిటీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో ప్రవేశ పెట్టిన తరువాత ఆగష్టు 8న పార్లమెంట్ సంయుక్త కమిటీకి సిఫార్సు చేసింది. వక్ప్ చట్టం-1995 కు సవరణ చేయడానికి ఈ బిల్లును ప్రవేశ పెట్టారు.