చరిత్రలో మోదీ అలాగే గుర్తుండిపోతారు: ఏఐసీసీ చీఫ్ ఖర్గే

ఎన్నికలు ముగిశాక ప్రజలు మోదీని విభజన, మతతత్వ ప్రసంగాలకు పాల్పడిన ప్రధానమంత్రిగా మాత్రమే గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.

Update: 2024-05-02 12:59 GMT

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలు ముగిశాక ప్రజలు మోదీని విభజన, మతతత్వ ప్రసంగాలకు పాల్పడిన ప్రధానమంత్రిగా మాత్రమే గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.

విద్వేషపూరిత ప్రసంగాలతో కాకుండా గత పదేళ్లలో తన ప్రభుత్వ పనితీరుపై ఓటర్లను అభ్యర్థించాలని ఖర్గే ప్రధానిని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై ఇటీవల మోదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వాటిని తిప్పికొడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధాని మోదీకి రాశారు.

'అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్పినా అది నిజం కాదు'

“ఓటర్లకు తెలియజేయాల్సిన విషయాల గురించి ఎన్‌డిఎ అభ్యర్థులందరికీ మీరు రాసిన లేఖను నేను చూశాను. లేఖలోని అంశాలను చూస్తే మీలో నిరాశ, ఆందోళన కనిపిస్తున్నాయి. మీరు ప్రధానమంత్రి కార్యాలయానికి సరిపోని భాషని ఉపయోగిస్తారు. కాని అవి జనం మీద ఏ ప్రభావాన్ని చూపడం లేదు. ఇప్పుడు మీ అబద్ధాలను పునరావృతం చేయాలని మీ అభ్యర్థులను కోరుతున్నారు. వెయ్యి సార్లు అబద్ధం చెప్పినా అది నిజం కాదు" అని ఖర్గే పేర్కొన్నారు.

'కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి రాస్తూ..

"మా హామీలు చాలా సరళమైనవి. స్పష్టంగా ఉన్నాయి, వాటిని మేము వారికి వివరించాల్సిన అవసరం లేదు. మీ ప్రయోజనం కోసం, నేను వాటిని ఇక్కడ పునరుద్ఘాటిస్తాను" అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నాడు. పార్టీ యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్ గురించి వివరించారు.

'మా ఓటు బ్యాంకు ప్రతి భారతీయుడిది - పేదలు, అట్టడుగు వర్గాలది. 1947 నుండి ప్రతి దశలోనూ రిజర్వేషన్లను వ్యతిరేకించినది ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి అని అందరికీ తెలుసు. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీరు స్పష్టం చేయాలి. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం వారి జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి’ అని ఖర్గే కోరారు.

'చట్టవిరుద్ద, రాజ్యాంగ విరుద్ధ ఎన్నికల బాండ్లు'

"చట్టవిరుద్ధ, రాజ్యాంగ విరుద్ధ " ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపి ₹ 8,250 కోట్లు కూడబెట్టిందని ఖర్గే ఆరోపించారు. ’మొదటి, రెండు దశల ఎన్నికలలో ఓటర్లు తక్కువగా ఉండటంతో మీరు ఆందోళన చెందుతున్నారని మీ లేఖ ద్వారా తెలుస్తుంది. ప్రజలు మీ విధానాల పట్ల లేదా మీ ప్రచార ప్రసంగాల పట్ల ఉత్సాహంగా లేరని లేఖను బట్టి తెలుస్తుంది.' అని కాంగ్రెస్ చీఫ్ అన్నారు.

నానాటికీ విస్తరిస్తున్న అసమానతలు, పెరిగిపోతున్న నిరుద్యోగం గురించి మాట్లాడేందుకు ప్రధాని ఆసక్తి చూపడం లేదని ఖర్గే పేర్కొన్నారు. మహిళలపై మీ నాయకులు చేస్తున్న అఘాయిత్యాల గురించి మాట్లాడేందుకు మీకు ఆసక్తి లేదు’ అని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

చర్చకు రావాలని  సవాల్‌..

“ప్రధానిగా మీరు ద్వేషపూరిత ప్రసంగాలకు బదులు గత పదేళ్లలో మీ ప్రభుత్వ పనితీరుపై ఓట్లు అడగడం ఉత్తమం. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని లేదా మీరు నియమించిన ఎవరినైనా మా మేనిఫెస్టోపై మాతో చర్చకు రమ్మని సవాలు చేస్తుంది." అని ఖర్గే పేర్కొన్నారు.

Tags:    

Similar News