కువైట్ అగ్ని ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి

కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. కేరళకు చెందిన ఇద్దరు వ్యాపారులు కూడా ఉదారతను చాటుకున్నారు.

Update: 2024-06-13 07:53 GMT

కువైట్‌లోని మంగాఫ్‌ ప్రాంతంలో ఉన్న భవనంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 195 మంది కార్మికులు ఉంటున్న ఈ భవనంలో వంట గదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 42 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో కేరళకు చెందిన వారు 19 మంది ఉన్నారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం..

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. కేరళ సీఎం పినరయి విజయన్ చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రూ. 5 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేరళలోని ప్రముఖ వ్యాపారులు MA యూసుఫ్ అలీ, రవి పిళ్లై ఉదారతను చాటుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను యూసుఫ్ అలీ రూ. 5 లక్షల చొప్పున, రవి పిళ్లై రూ. 2 లక్షలు చొప్పున అందజేయనున్నారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ గురువారం కువైట్ వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

మృతదేహాలను త్వరగా పంపండి..

ఇటు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కువైట్ ప్రభుత్వాన్నికోరారు.

Tags:    

Similar News