ఖలిస్తాన్ వివాదం: నిజ్జర్ నిందితులు కోర్టుకు.. కౌంటర్ ఇచ్చిన భారత్..
భారత్- కెనడా మధ్య ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ దేశంలోని పౌరులను హత్య చేస్తుందని కెనడా.. విచ్చిన్నకర శక్తులకు అండ అందిస్తున్నారని భారత్ ఎదురుదాడులకు..
By : Praveen Chepyala
Update: 2024-05-08 12:10 GMT
గత ఏడాది ఖలిస్తాన్ వేర్పాటువాది, భారత్ లో మోస్ట్ వాంటేడ్ ఉగ్రవాదీ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు భారతీయులను పోలీసులు వీడియో కాన్పరెన్స్ ద్వారా కోర్టులో హజరుపరిచారు.
ఎడ్మంటన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు కరణ్ బ్రార్, 22, కమల్‌ప్రీత్ సింగ్, 22, కరణ్‌ప్రీత్ సింగ్, 28, శుక్రవారం అరెస్టు చేసి, హత్య, హత్యకు కుట్ర పన్నారని అభియోగాలు మోపారు. వీరంతా స్టూడెంట్ వీసాపై కెనడాలోకి ప్రవేశించినట్లు సమాచారం.
కోర్టును ముట్టడించిన ..
వీరు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని సర్రే ప్రావిన్షియల్ కోర్టు ముందు హజరయ్యారు. ఈ ముగ్గురే నిజ్జర్ ను షూట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హిట్ స్వ్కాడ్ టీమ్ గా వీరిని గ్యాంగ్ లో పిలుస్తారని ప్రధాన అభియోగం. నిందితులు కోర్టు వస్తున్నారనే సమాచారంతో అక్కడికి వందలాది మంది ఖలిస్తాన్ వేర్పాటువాదులు గుమిగూడారని స్థానిక వాంకోవర్ సన్ రిపోర్టు చేసింది. కోర్టు లోపల ఓ 50 మంది ఉండగా, బయట మరో 100 మంది బయట వేచి ఉన్నారని పత్రికా తెలిపింది. కెనడియన్ పౌరుడైన నిజ్జర్ జూన్ 18, 2023న సర్రేలోని గురుద్వారా వెలుపల కాల్చి చంపబడ్డాడు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో నిందితులు
వీరు ముగ్గురు కూడా జైలు జారీ చేసిన ఎరుపురంగు టీ షర్టులు, ప్యాంట్లు ధరించారు. వీరిపై ఆరోపించబడిన నేరాలను జడ్డి చదివి వినిపించారు. వీరు ఆంగ్లంలో విచారణ ఎదుర్కొనేందుకు అంగీకరించారని తెలిసింది.
మే 1, 2023 మధ్య సర్రే, ఎడ్మోంటన్ రెండింటిలోనూ నిజ్జర్‌ను చంపిన తేదీ మధ్య కుట్ర బయటపడిందని అభియోగ పత్రంలో ఉంది. వీరు ఐదు సంవత్సరాల క్రితం కెనడాలోకి ప్రవేశించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హింస ప్రవృత్తిలో పాలు పంచుకుంటున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
భారత్ పై మరోసారి విషం కక్కిన ఖలిస్తాన్..
నిజ్జర్ హత్యకు సంబంధించి విచారణ జరగడానికి రెండు రోజుల ముందు ఖలిస్తాన్ మూకలు రెచ్చిపోయాయి. అంటారియో ప్రాంతంలోని మాంటారియోలో విభజన మూకలు.. భారత ప్రధాని దిష్టిబొమ్మను అభ్యంతరకర రీతిలో ఉపయోగిస్తూ నిరసనలు చేపట్టాయి. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.
విచ్చిన్నకర శక్తులు, విభజన వాదులకు కెనడా రాజధానిగా మారిందని, వారికి రాజకీయ క్రీడా వేదికగా మారిందని ఆక్షేపించింది. అట్టావా హింసను ఓ ఉత్సవం లా చూసి కీర్తిస్తోందని విమర్శించింది. భారత దౌత్య వేత్తల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైన కెనడా బాధ్యతాయుతంగా ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
భారత విదేశాంగ శాఖ ప్రతినిధి..
"కెనడాలో క్రిమినల్, వేర్పాటువాద అంశాలకు సురక్షితమైన స్వర్గధామంగా మారింది. వీరికి రాజకీయ గొంతును సైతం అందిస్తోంది. మేము కెనడా ప్రభుత్వాన్ని మళ్లీ కోరుతున్నాము." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ అన్నారు.
గత ఏడాది జూన్‌లో జరిగిన పరేడ్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ఎలా చిత్రీకరించారో కూడా జైస్వాల్ గుర్తు చేసుకున్నారు.
"మీకు తెలిసినట్లుగా, కెనడాలోని తీవ్రవాద మూకలు మా రాజకీయ నాయకత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక చిత్రాలను ఉపయోగిస్తున్నాయని మేము పదేపదే మా ఆందోళనలను బలంగా లేవనెత్తాము. గత సంవత్సరం, మన మాజీ ప్రధాని హత్యను చిత్రీకరించే ఫ్లోట్‌ను ఊరేగింపులో ఉపయోగించారు, ”అని రంధీర్ చెప్పాడు.
కెనడా అంతటా భారత దౌత్యవేత్తల పోస్టర్లను ప్రదర్శించి వారిపై హింసాత్మక చర్యలకు ఉసిగొల్పుతున్నట్లు జైస్వాల్ తెలిపారు. “హింసను జరుపుకోవడం, కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాకూడదు. చట్టబద్ధమైన పాలనను గౌరవించే ప్రజాస్వామ్య దేశాలు భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో రాడికల్ ఎలిమెంట్స్ బెదిరింపులను అనుమతించకూడదు' అని ఆయన తీవ్రంగా మందలించారు.
"కెనడాలోని మా దౌత్య ప్రతినిధుల భద్రత గురించి మేము ఆందోళన చెందుతూనే ఉన్నాము. వారు తమ బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించగలరని కెనడా ప్రభుత్వం నిర్ధారిస్తుంది" అని మీడియా సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రూడో ..
నిజ్జర్ హత్యపై ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చేసిన తాజా వ్యాఖ్యలను భారతదేశం గురువారం ఖండించింది. ఈ వ్యాఖ్యలు కెనడాలో వేర్పాటువాదం, తీవ్రవాదం, హింసకు మద్ధతు ఇస్తున్నట్లు స్పష్టంగా బయటపడిందని వ్యాఖ్యానించింది. ట్రూడో ఆదివారం టొరంటోలో జరిగిన ఖల్సా డే కార్యక్రమంలో కొంతమంది ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులు పాల్గొన్నారు.
45 ఏళ్ల నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం గురించి గత ఏడాది సెప్టెంబర్‌లో ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్- కెనడా మధ్య దౌత్య ఉద్రికత్తలకు దారి తీసింది. ట్రూడో చేసిన ఆరోపణలను ఖండించింది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించింది. నిజ్జర్ ను ఒక ఉగ్రవాదీగా పేర్కొంది. ఇతని హత్యకు సంబంధించి ముగ్గురు భారతీయ పౌరులను అరెస్ట్ చేసిన తరువాత కెనడా పోలీసులు ఎలాంటి అదనపు వివరాలను భారత్ కు అందజేయలేదు.
మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం
నిజ్జర్ హత్య కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు సూచించారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ టెబౌల్, పసిఫిక్ రీజియన్‌కు ఫోర్స్ కమాండర్, మాట్లాడుతూ.. రాజకీయ వ్యాఖ్యాలకు తాము సమాధానం ఇవ్వలేమని, అయితే ఇతర సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
జైశంకర్ పంచ్.. అది వారి ఓటు బ్యాంకు..
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం మాట్లాడుతూ కెనడాలో ఎన్నికల సందర్భంగా నిజ్జర్ హత్యపై జరుగుతున్నది వారి అంతర్గత రాజకీయాల వల్లనేనని, భారత్‌తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఖలిస్థాన్ అనుకూల ప్రజలలో ఒక వర్గం కెనడా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుంటోందని, లాబీని సృష్టించి ఓటు బ్యాంకుగా మారిందని ఆయన అన్నారు.
కెనడాలోని అధికార పార్టీకి పార్లమెంట్‌లో మెజారిటీ లేదని, కొన్ని పార్టీలు ఖలిస్థాన్ అనుకూల నేతలపై ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు. "వారికి (కెనడా), మాకు, మా సంబంధాలకు కూడా సమస్యలు సృష్టిస్తున్న అటువంటి వ్యక్తులకు వీసా, చట్టబద్ధత లేదా రాజకీయ స్థలాన్ని ఇవ్వవద్దని మేము వారిని చాలాసార్లు కోరాము" అని జైశంకర్ చెప్పారు.
కానీ కెనడా ప్రభుత్వం ఏమీ చేయలేదు, జైశంకర్ మాట్లాడుతూ, భారతదేశం 25 మందిని అప్పగించాలని కోరింది, వీరిలో ఎక్కువ మంది ఖలిస్థాన్ అనుకూలురు, కానీ వారు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే నిజ్జర్ హత్యకు సంబంధించి వారు ఇప్పటి వరకూ ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని అన్నారు.
"కెనడా ఎటువంటి రుజువు ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో మాతో ఎలాంటి సాక్ష్యాలను పంచుకోరు, పోలీసు ఏజెన్సీలు కూడా మాకు సహకరించవు. భారతదేశాన్ని నిందించడం కెనడాలో వారి రాజకీయ మనుగడకు అవసరం. కెనడాలో ఎన్నికలు వస్తున్నందున, వారు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు, ”అని మంత్రి అన్నారు.