ప్రేమికుడిని చంపిన ప్రియురాలికి మరణశిక్ష..

జీవితం పంచుకుందామనుకున్న ప్రేయసే అతడి పాలిట రాక్షసి అయింది. ప్రేమించిన పాపానికి ఆ ప్రేయసే అతడి మరణశాసనాన్ని రాసింది.;

Update: 2025-01-20 09:50 GMT

జీవితం పంచుకుందామనుకున్న ప్రేయసే అతడి పాలిట రాక్షసి అయింది. ప్రేమించిన పాపానికి ఆ ప్రేయసే అతడి మరణశాసనాన్ని రాసింది. ప్రేమించినట్లు నటిస్తూనే అతడిని వదిలించుకోవాలని భావించింది. అందుకోసం అతడిని అనంతలోకాలకు పంపడానికి కూడా సిద్ధమైంది. కేరళకు చెందిన షరోన్ రాజ్ అనే యువకుడి ప్రేయసి చేసిన ఘనకార్యం ఇది. కేరళలోని పరశాల తిరువనంతపురం శివారు ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్.. 2022 అక్టోబర్ 25న మరణించాడు. అతడి మరణంపై అనుమానం కలగడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తీగలాగితో డొంక కదిలినట్లు షరోన్ రాజ్ మరణం వెనక ఉన్న ప్రేయసి మాస్టర్ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. అతడిపై విషప్రయోగం జరిగిందని తెలియడంతో పోలీసులు రెట్టించిన వేగంతో దర్యాప్తును పరుగులు పెట్టించారు. ఈ కేసు తాజాగా కొలిక్కి వచ్చింది. ప్రేయసి గ్రీష్మను దోషిగా నిర్ధారించిన న్యాస్థానం.. ఆమెకు మరణశిక్ష విధించింది. అదే విధంగా ఇందులో ఆమెకు సహాయం చేసిన బంధువుకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ అంశం ప్రస్తుతం జాతీయ స్థాయిలో సంచలనం రేకెత్తిస్తోంది.

గ్రీష్మ తల్లిదండ్రులు ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయించారు. దీంతో షరోన్ రాజ్‌తో ఉన్న ప్రేమాయణానికి స్వస్థి పలకాలని గ్రీష్మ నిశ్చయించుకుంది. కాకపోతే ఎలా వదిలించుకోవలన్నది మాత్రం అంతుచిక్కలేదు. చివరకు షరోన్‌ను చంపేయాలని అనుకుంది. అందుకోసం పక్కా ప్లాన్ రచించుకుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం 14 అక్టోబర్ 2022న షరోన్‌ను తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని రామవర్మంచిరైలో ఉన్న తన ఇంటికి రప్పించి గ్రీష్మ. అక్కడ విషం కలిపిన పానియాన్ని ప్రేమగా తాపించింది. అది తాగిన షరోన్ రాజ్ దాదాపు 11 రోజుల పాటు నరకయాతన అనుభవించాడు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. అతడి మరణంపై అనుమానాలు రేకెత్తడంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కాగా షరోన్ రాజ్.. అవయవాలు క్షీణించి మరణించి ఆర్గాన్ ఫెయిల్యూర్ కావడంతో మరణించాడని వైద్యులు నిర్ధారించారు.

దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు గ్రీష్మ మేనమామ నిర్మల్ కుమార్, తల్లిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో క్రమంలో 31 అక్టోబర్ 2022న నేరం చేసినట్లు వారు అంగీకరించారు. ఈ కేసు అంశంలో అప్పటి నుంచి న్యాయస్థానంలో వాదోపవాదనలు జరిగాయి. కాగా తాజాగా 17 జనవరి 2025న గ్రీష్మను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఆమెతో పాటు మేనమామ నిర్మల్ కుమార్‌ను కూడా దోషిగా పరిగణించి శిక్ష వెల్లడించింది. గ్రీష్మ తల్లిని మాత్రం న్యాయస్థానం నిర్దోషిగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై షరోన్ రాజ్ తల్లి సంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమారుడికి మూడు సంవత్సరాలకు న్యాయం జరిగిందని అన్నారు.

Tags:    

Similar News