పదిశాతం ఉద్యోగులను తొలగించనున్న బోయింగ్

కంపెనీకి నష్టాలు రావడంతో తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో పది శాతం మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు కంపెనీని ఉటంకిస్తూ ఓ అంతర్జాతీయ మీడియా వార్తలు..

By :  491
Update: 2024-11-14 11:34 GMT

అమెరికా కేంద్రంగా ఉన్న అనేక ప్రముఖ టెక్ కంపెనీలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకగా తాజాగా ఈ జాబితాలో బోయింగ్ కూడా చేరింది. ప్రధాన కంపెనీతో సహ అనేక అనుబంధ సంస్థలు సంక్షోభంతో పోరాడుతూ ఉన్నందున 17 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి నోటీసులు జారీ చేసింది. ఇది బోయింగ్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో దాదాపు 10 శాతానికి సమానమని తెలుస్తోంది.

" ఇంతక్రితం ప్రకటించినట్లుగా, మేము మా ఆర్థిక వాస్తవికతపై దృష్టి సారించి, కంపెనీ ప్రాధాన్యతకు అనుగుణంగా మా గ్లోబల్ వర్క్ ఫోర్స్ స్థాయిలను సర్దుబాటు చేస్తున్నాము’’ అని వార్తా సంస్థ రాయిటర్స్ బోయింగ్‌ను ఒక ప్రకటనలో ఉటంకిస్తూ పేర్కొంది. " ఈ సవాలు సమయంలో మా ఉద్యోగులకు మద్దతు ఉందని నిర్ధారించడానికి కూడా మేము కట్టుబడి ఉన్నాము" అని ఆ ప్రకటన పేర్కొంది.

బోయింగ్‌ను వేధిస్తున్న సమస్యలు..

USలో 33,000 కంటే ఎక్కువ వెస్ట్ కోస్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అయితే ఈ సమ్మెతో దాని కమర్షియల్ జెట్ ల ఉత్పత్తి ఆగిపోయి నష్టాలు తలెత్తాయి. బోయింగ్ లో అత్యధికంగా అమ్ముడైన 737 మ్యాక్స్ ఉత్పత్తిని పున: ప్రారంభిస్తున్న సమయంలో ఉద్యోగుల తొలగింపు జరిగింది.

737 MAX ఈ సంవత్సరం అక్టోబర్‌లో $24 బిలియన్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. అయితే కొంతకాలంగా బోయింగ్ విమానాలు వరుసగా క్రాష్ అవుతున్నాయి. జనవరిలో, గాలిలో 737 MAX జెట్ నుండి డోర్ ప్యానెల్ ఊడిపోయింది. తమ భద్రతా ప్రమాణాలు రాజీ పడటంతో ఈ నష్టాలు సంభవిస్తున్నాయని కంపెనీ భావించింది. ఈ పరిణామంలో కంపెనీ సీఈఓ రాజీనామా చేశారు. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని అనుకున్న తరుణంలో సెప్టెంబర్ లో కంపెనీ లో సమ్మె ప్రారంభమైంది.


Tags:    

Similar News