అదానీ సంక్షోభం: హిండెన్‌బర్గ్ కన్నా పెద్దదా?

అదానీ, దాని అనుబంధ సంస్థలు సోలార్ పవర్ సప్లై ఒప్పందాలకు సంబంధించి భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఆఫర్‌ చేశారని అభియోగం.

Update: 2024-11-23 10:43 GMT

గౌతం అదానీ గురించి తెలియని వారుండరు. ఈయన వ్యాపార సామ్రాజ్యాధినేత. ఇటీవల ఈయనపై అమెరికాలో కేసు నమోదైంది. అదానీ, దాని అనుబంధ సంస్థలు సోలార్ పవర్ సప్లై ఒప్పందాలకు సంబంధించి భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఆఫర్‌ చేశారని అభియోగం.

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ మారిషస్‌కు చెందిన అజూరే పవర్ కంపెనీ సెకీతో ఒప్పందం చేసుకుంది. సెకీ నుంచి సోలార్ పవర్ కొనుగోలుకు దేశంలోని ఏ రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ ముందుకు రాకపోవడంతో రంగంలోకి దిగారు. మొత్తం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన డిస్కమ్‌ అధికారులకు ఆయన లంచాలు ఇచ్చి ఒప్పించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ పేరుతో అమెరికాలోని బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరించింది. ఈ నిధుల నుంచే లంచాలు ఇచ్చారనేది న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు ఆరోపణ. లంచం ఆరోపణలను తోసిపుచ్చింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లంచం ఇచ్చారన్న అబియోగాలు నిరాధారమని కొట్టి పారేసింది.

ఈ నేపథ్యంలో నీలు వ్యాస్ హోస్ట్‌గా వ్యవహరించిన ది ఫెడరల్స్ ‘క్యాపిటల్ బీట్‌’ డిబేట్‌ నిర్వహించారు. ఇందులో సుప్రీంకోర్టు న్యాయవాది సంజయ్ హెడ్జే, ది ఫెడరల్ బిజినెస్ ఎడిటర్ గిరి ప్రకాశ్‌ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

హిండెన్‌బర్గ్ కంటే పెద్ద సంక్షోభమా?

ఇటీవలి హిండెన్‌బర్గ్ నివేదికతో పోలిస్తే.. తాజా పరిణామాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెగ్డే అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణల కారణంగా ఇది మరింత సంక్లిష్టంగా మారుతోందన్నారు

అదానీ అప్పులను తీర్చడానికి ఆస్తులను అమ్మడానికి ప్రయత్నించవచ్చని గిరి ప్రకాశ్‌ అభిప్రాయపడ్డారు. షేక్ మార్కెట్ కూడా ఒడుదుడుగులకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

Full View

Tags:    

Similar News