స్పిన్నర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన మురళీధరన్.. కారణం..

భారత స్పిన్నర్లు బంతిని సరిగా స్పిన్ చేయడం లేదని దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్నాడు.

Update: 2024-04-28 08:41 GMT

క్రికెట్ లో బ్యాట్స్ మెన్ పెద్ద షాట్లను నియంత్రించేందుకు భారత యువ స్పిన్నర్లు బంతిని ఎక్కువగా స్పిన్ చేయట్లేదని దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు స్ట్రాటజిక్ కోచ్ గా ఉన్న ముత్తు ఈ వ్యాఖ్యలు చేశారు.

స్పిన్నర్లు బంతిని స్పిన్ చేయని నిరుత్సాహకర ధోరణిని విశ్లేషిస్తూ, యువకులు కొంత వేగంగా బౌలింగ్ చేస్తున్నారని, బంతి నేరుగా బ్యాట్స్ మెన్ కదలికలను వేగంగా గమనిస్తున్నారని అన్నారు. "ఇండియా లో ఉన్న యువస్పిన్నర్ల సమస్య ఏంటంటే, చాలా మంది స్పిన్నర్లు బంతిని స్పిన్ చేయడం లేదు, ఎందుకంటే వారు కొంచెం వేగంగా బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్ లేకపోతే, డివియేషన్ (డ్రిఫ్ట్) ఉండదు" అని ఆదివారం నాటి మ్యాచ్ కు ముందు జరిగిన ప్రీ-మ్యాచ్ విలేకరుల సమావేశంలో మురళీధరన్ అన్నారు. ఆదివారం చెన్నై చెపాక్ చిదంబరం వేదికగా ఎస్ఆర్ హెచ్, సీఎస్కే తలపడనున్నాయి.
"బ్యాట్స్ మెన్ నెట్స్ వద్ద త్రోడౌన్‌లను ఎదుర్కొంటారు, చాలా బంతులు నేరుగా వస్తాయి. కాబట్టి, బ్యాటర్లు తదనుగుణంగా తమ మైండ్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు. అలాంటి బంతులను వారు స్టాండ్ లోకి పంపాలని చూస్తారు. కాబట్టి, స్పిన్నర్లు మెరుగైన అవకాశం కోసం బంతిని ఎలా స్పిన్ చేయాలో నేర్చుకోవాలి." అని సూచించాడు.
CSK వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. హోంగ్రౌండ్ లో గెలవాలని చూస్తోంది, చివరి మ్యాచ్ లో హైదరాబాద్ కూడా బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. కాబట్టి ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు చూడవచ్చని అన్నారు.
ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ ఖాయమని అంచనావేశారు. అంతకుముందు ఇదే గ్రౌండ్ లో లక్నో తో జరిగిన మ్యాచ్ లో చెన్నై రెండువందల పరుగులకు పైగా సాధించింది. అయితే లక్నో దానిని చేధించింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్, లక్నో బ్యాట్స్ మెన్ మార్కస్ స్టాయినిస్ సెంచరీలతో చెలరేగారు.
చెపాక్ డ్రైయర్ సైడ్‌లో పిచ్ ఉంటే టర్న్ ఆన్ ఆఫర్ ఉంటుందని మురళి చెప్పారు. నేను "ఇంకా వికెట్ చూడలేదు. అది పొడిగా ఉంటే, స్పిన్‌కు ఎక్కువ అవకాశం ఉంది" అన్నారు.
"గేమ్ లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. జట్లు ఫ్లాట్ వికెట్‌లను సిద్ధం చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న 120 డెలివరీలను చక్కగా ఉపయోగించుకోవాలని జట్లు చూస్తున్నాయి. స్ట్రైక్ రేట్‌లను కూడా ఎక్కువగా పరిశీలిస్తున్నాయి." ఈ ఎడిషన్‌లో తమ జట్టు ఆడుతున్న క్రికెట్ బ్రాండ్ పట్ల సంతోషంగా ఉన్నానని మురళీ చెప్పాడు.
ఇంపాక్ట్ సబ్ విధానం అర్థం కావడానికి సమయం..
"ఒక జట్టు అన్ని మ్యాచ్ లను గెలవదు. కచ్చితంగా ఓటములు కూడా ఉంటాయి. మన ఆటలలో 60% గెలవగలిగితే, ప్లేఆఫ్‌లలోకి ప్రవేశించడానికి అవకాశం లభిస్తుంది". గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం గణనీయమైన ప్రభావాన్ని చూపడంతో, బౌలర్లు కూడా త్వరలో ఎదురుదాడి ప్రణాళికతో వస్తారని మురళి భావించాడు.
"ఏదైనా కొత్త నియమం వస్తే అది అర్థం కావడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఈ సంవత్సరం, జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని బాగా స్వీకరించాయి, ఫలితంగా 20-30 పరుగులు అదనంగా వచ్చాయి," అని అతను వివరించాడు.
"బౌలర్ కంటే బ్యాటర్‌కు ఇది చాలా ప్రయోజనకరం, ఎందుకంటే వారు అవుట్ అవుతామని భయపడట్లేదు, నా కింద మరొక బ్యాట్స్ మెన్ ఉన్నారనే భరోసా వారికి ఉంది. అలాగే ఈ సంవత్సరం, వికెట్లు చాలా ఫ్లాట్‌గా ఉన్నాయి. అవుట్‌ఫీల్డ్‌లు చాలా వేగంగా ఉన్నాయి, దీని ఫలితంగా అదనపు పరుగులు కూడా వచ్చాయి. ఫలితంగా, ఒకప్పుడు 170-180 మంచి స్కోరు అనుకునేవాళ్లం. ఇప్పుడు 220-230 వస్తే కాని చెప్పలేని పరిస్థితి"
త్వరలో బౌలర్లు మరో మంచి ఆయుధంతో వస్తారు. వారు వెనక్కి తగ్గరని ముత్తయ్య మురళీధరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఐదుగురు బౌలర్లను ఉపయోగించింది. కానీ ఉమ్రాన్ మాలిక్ ను ఇప్పటి వరకూ తుది జట్టులో ఆడించలేదు.
దీనిపై మురళీ స్పందిస్తూ.. బ్యాట్స్ మెన్ ఎక్కువ పేస్ ఆడుతున్నారని, వారి బౌలింగ్ వేగంగా పరుగులు సాధిస్తున్నారని అంగీకరించారు. ఇప్పుడు మాలిక్ కు అంత అనుభవం లేదని అన్నారు. ఇప్పుడు తన వ్యూహాలను మార్చుకుని ఎదురుదాడి చేయడం ప్రారంభించాలి. ఇప్పుడు ఇదే పని మాలిక్ చేస్తున్నాడు. అతని కోసం అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని ముత్తయ్య మరళీధరన్ అన్నాడు.
Tags:    

Similar News