ఉగ్రవాద ఫ్యాక్టరే కాదు.. బిచ్చగాళ్ల ఫ్యాక్టరీ కూడానా..
మన దాయాదీకి ఇంతకుముందు ప్రపంచ ఉగ్రవాద ప్యాక్టరీగా పేరుండేది. ఇప్పుడు మరో రంగంలోనూ దాని పేరు మరోమారు వినిపిస్తోంది. అదే ముష్టివాళ్లను ఎగుమతి చేసే దేశంగా..
By : 491
Update: 2024-09-26 06:23 GMT
పాకిస్తాన్ కు సౌదీ అరేబియా గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశానికి మంజూరు చేసిన హజ్ కోటను దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందంది. యాత్రికులుగా నటిస్తూ తమ దేశంలోకి బిచ్చగాళ్లను పంపుతున్నారని, వెంటనే ఇలాంటి విషయాలను అరికట్టాలని వార్నింగ్ ఇచ్చింది.
పాకిస్తాన్ వార్తా పత్రికల ప్రకారం.. పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే, అది పాకిస్తాన్ ఉమ్రా, హజ్ యాత్రికులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని సౌదీ అధికారులు హెచ్చరించారు. పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆధారాలను ఈ నివేదిక ఉటంకించింది.
ఉమ్రా వీసాలతో పాకిస్థానీ యాచకులు రాజ్యంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసిందని వార్తాపత్రిక నివేదిక పేర్కొంది.
యాచకుల నియంత్రణకు చర్యలు
సౌదీ అరేబియా హెచ్చరిక తర్వాత, ఉమ్రా యాత్రలను నిర్వహించే ట్రావెల్ ఏజెన్సీలపై కొన్ని చట్టపరమైన నియంత్రణలను ప్రవేశపెట్టేందుకు ఉమ్రా చట్టాన్ని ప్రవేశపెట్టాలని మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అంతేకాకుండా, యాత్రికుల ముసుగులో సౌదీకి వెళ్లే యాచకులను నిరోధించేందుకు వ్యూహాలు రూపొందించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని మంత్రిత్వ శాఖ కోరింది.
సౌదీకి యాచకులను పంపుతున్న మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ సౌదీ అరేబియాకు హామీ ఇచ్చారు. ఈ మాఫియాను అణిచివేసే బాధ్యతను ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ)కి అప్పగించినట్లు ఆయన తెలిపారు.
యాచకులపై విరుచుకుపడుతున్నారు
పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకారం, యాచకులు తీర్థయాత్రకు వెళ్లే నెపంతో మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లి ఉమ్రా వీసాలు తీసుకుని, ఆ తర్వాత యాచక సంబంధిత పనులతో పాటు స్థానికంగా నేరాలకు పాల్పడుతున్నారు. అంతేకాక అక్కడి స్త్రీలపై అత్యాచారాలకు తెగబడుతున్నారనే నివేదికలు ఉన్నాయి.
ఇటీవల, కరాచీ విమానాశ్రయంలో సౌదీకి వెళ్లే విమానం నుంచి 11 మంది యాచకులను ఆఫ్‌లోడ్ చేయగా, గత సంవత్సరం సెప్టెంబర్‌లో, యాత్రికుల వేషంలో 16 మంది యాచకులను సౌదీ అరేబియాకు వెళ్లే విమానం నుంచి దించి వేశారు. భిక్షాటన చేసేందుకు సౌదీకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు వారిని అరెస్టు చేశారు.
మక్కా మసీదు చుట్టుపక్కల అరెస్టయిన పిక్‌పాకెట్లలో ఎక్కువ మంది పాకిస్థానీలేనని విదేశీ పాకిస్థానీల కార్యదర్శి జీషన్ ఖంజదా అంగీకరించారు. ఇక్కడ అరెస్ట్ అవుతున్న వంద మంది 90 మంది పాకిస్తాన్ వాసులే కావడంతో సౌదీ ఆగ్రహానికి కారణమైంది. కాబా చుట్టూ ప్రదక్షిలు చేస్తున్న సమయంలో కూడా పాకిస్తాన్ ముష్టి మాఫియా తమ చేతివాటం ప్రదరిస్తోంది. వీటికి సంబంధించి అనేక ఫిర్యాదు రావడంతో స్థానికంగా ఉన్న పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంలో విషయం వెలుగులోకి వచ్చింది.
కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్ ఎకనామీలో దాదాపు 11 శాతం మేర ఇలా బెగ్గింగ్ మాఫియా వాటా ఉందని ఓ లెక్క. మధ్యాసియా దేశాలకు వెళ్తున్న ఈ బెగ్గింగ్ ముఠాలు అక్కడ సంపన్నుల నుంచి డబ్బులు ఇచ్చేదాక వేధిస్తుంటారని, తరువాత వాటిని దేశానికి చేరవేస్తుంటారని సమాచారం.
ఈ బెగ్గింగ్ విషయంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఇతర ఉన్నతాధికారులు, మిలిటరీ అధికారులు పాకిస్తాన్ లో ఉన్న సౌదీ ఎంబసీకి స్వయంగా వెళ్లి వారికి హమీ ఇచ్చారు.