మరోసారి ‘చాన్స్ లర్’ తో ప్రైవేట్ గా భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నా చేరుకున్నారు. ఆయన మరోసారి చాన్స్ లర్ కార్ల్ నెహమ్మార్ తో ప్రైవేట్ గా..
By : Praveen Chepyala
Update: 2024-07-10 05:11 GMT
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా వెళ్లారు. ఆ దేశంలో భారత అధినేత పర్యటించడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే మొదటి సారి. ఆస్ట్రియా ఛాన్స్ లర్ తో భారత ప్రధాని మరోసారి ప్రైవేట్ గా సంభాషించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
“భారత్-ఆస్ట్రియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి! ప్రైవేట్ ఎంగేజ్‌మెంట్ కోసం ఆస్ట్రియన్ ఛాన్సలర్ @karlnehammer, PM @narendramodi తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇద్దరి నేతల మధ్య ఇదే తొలి భేటీ. ద్వైపాక్షిక భాగస్వామ్యం పూర్తి సామర్థ్యంతో పని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.’’ అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వియన్నాలో ఇద్దరు నాయకులు కలిసి ఉన్న ఫోటోలతో పాటు X లో రాశారు.
హగ్- సెల్ఫీ
మోదీ ఒక ఫొటోలో నెహమ్మర్‌ను కౌగిలించుకుని ఉండగా, మరో ఫొటోలో ఆస్ట్రియా ఛాన్సలర్ ప్రధానితో సెల్ఫీ దిగుతూ కనిపించారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో నెహామర్ తను, మోదీ ఉన్న ఫోటోను పోస్ట్ చేసి ఇలా రాసుకొచ్చారు.. “వియన్నాకు స్వాగతం, PM @narendramodi! మిమ్మల్ని ఆస్ట్రియాకు స్వాగతించడం ఆనందం, గౌరవంగా ఉంది. ఆస్ట్రియా- భారత్ స్నేహితులు, భాగస్వాములు. మీ పర్యటనలో మన రాజకీయ, ఆర్థిక చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాను’’ అని పోస్ట్ చేశారు.
వియన్నా ఆతిథ్యం మోదీ కూడా సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందించారు. " ఆస్ట్రియన్ ఛాన్సలర్ ఇచ్చిన ఆదరమైన స్వాగతం"కి కృతజ్ఞతలు. "రేపు జరిగే చర్చల కోసం" తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. "మన రెండు దేశాలు, ప్రపంచ దేశాల మంచి కోసం కలిసి పని చేస్తూనే ఉంటాయి" అని ఆయన రాశారు.
ఎక్స్ లోని మరొక పోస్ట్‌లో, మోదీ ఇలా అన్నారు. “వియన్నాలో ఛాన్సలర్ @karlnehammer. ని కలవడం సంతోషంగా ఉంది. భారత్-ఆస్ట్రియా స్నేహం బలంగా ఉంది. రాబోయే కాలంలో ఇది మరింత బలపడుతుందని’’ విశ్వాసం వ్యక్తం చేశారు. 1983లో ఇందిరాగాంధీ చివరగా వియన్నాలో పర్యటించారు.
మోదీ, ఆస్ట్రియా పర్యటన సందర్భంగా, రెండు దేశాలు తమ బంధాన్ని మరింతగా పెంచుకోవడానికి, వివిధ భౌగోళిక రాజకీయ సవాళ్లపై సన్నిహిత సహకారానికి మార్గాలను అన్వేషించనున్నాయి.
75వ వార్షికోత్సవం
విమానాశ్రయంలో మోదీకి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ స్వాగతం పలికారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ సంవత్సరంతో రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు నెలకొని 75 వసంతాలు పూర్తయ్యాని పేర్కొంది. ఈ ముఖ్యమైన పర్యటన భారత్-ఆస్ట్రియా సంబంధాలకు కొత్త ఊపును ఇస్తుందని వివరించింది. రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్‌తో మోదీ బుధవారం సమావేశమై నెహమ్మర్‌తో చర్చలు జరపనున్నారు. అనంతరం ప్రధాన మంత్రి, ఆ దేశ నాయకులు, ఆస్ట్రియా నుంచి వ్యాపార నాయకులను కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు.
విలువల మార్పు..
ఆస్ట్రియా పర్యటనకు ముందు మోదీ ఆదివారం మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్ట పాలన భాగస్వామ్య విలువలు రెండు దేశాల మధ్య ఎప్పటికీ సన్నిహిత భాగస్వామ్యాన్ని నిర్మించడానికి పునాదిగా ఉన్నాయని అన్నారు.
మా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం అనేక భౌగోళిక రాజకీయ సవాళ్లపై సన్నిహిత సహకారం గురించి మాట్లాడటానికి మాకు అవకాశం ఉంటుంది అని ఆస్ట్రియన్ ఛాన్సలర్ చెప్పారు.
నెహమ్మర్‌పై మోదీ స్పందిస్తూ, “ధన్యవాదాలు, ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా ఆస్ట్రియాను సందర్శించడం నిజంగా గౌరవం. మన దేశాల మధ్య బంధాలను బలోపేతం చేయడం. సహకారానికి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడంపై జరిగే చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాను. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్ట నియమాల, భాగస్వామ్య విలువలు మేము మరింత సన్నిహిత భాగస్వామ్యాన్ని నిర్మించడానికి పునాదిని ఏర్పరుస్తాయి.