బంగారు ఆభరణాల వినియోగంలో చైనాను మించిపోయిన భారత్

2024లో RBI 73 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఇది 2023లో కొనుగోలు చేసిన 16 టన్నుల కంటే చాలా రెట్లు ఎక్కువ.;

Update: 2025-02-05 11:55 GMT

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు(Gold) ఆభరణాల వినియోగ దేశంగా భారత్ (India) అవతరించింది. 2024లో 563.4 టన్నుల బంగారు ఆభరణాల వినియోగంతో చైనా(China)ను (511.4 టన్నులు) అధిగమించింది. అదే ఏడాది బంగారు ఆభరణాల వినియోగం 5 శాతం పెరిగి 802.8 టన్నులకు చేరుకోగా.. అంతకుముందు ఏడాది (2023)లో ఇది 761 టన్నులుగా ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం.. 2025లో మనదేశంలో బంగారం వినియోగం 700-800 టన్నుల మధ్య ఉండే అవకాశం ఉంది.

బంగారం ధరల పెరుగుదల..

2024లో బంగారం డిమాండ్ విలువ 31 శాతం పెరిగి రూ. 5,15,390 కోట్లకు చేరుకుంది. ఇది 2023లో రూ. 3,92,000 కోట్లు మాత్రమే. ఈ ఏడాది బంగారం ధర 8.07 శాతం పెరిగి జనవరి 1న 10 గ్రాములకు రూ. 79,390 ఉండగా.. ప్రస్తుతం రూ. 85,800కు చేరుకుంది. "2025లో బంగారం డిమాండ్ 700-800 టన్నుల మధ్య ఉంటుందని అంచనా. పెళ్లిళ్ల సమయంలో కొనుగోళ్లు పెరిగే అవకాశముంది. అయితే ధరలు స్థిరంగా ఉండాలి," అని WGC భారత విభాగం CEO సచిన్ జైన్ తెలిపారు.

తగ్గిన బంగారు ఆభరణాల డిమాండ్..

2024లో బంగారు ఆభరణాల డిమాండ్ 2 శాతం తగ్గి 563.4 టన్నులకు చేరుకుంది. 2023లో ఇది 575.8 టన్నులుగా ఉంది. ఇదంతా బంగారం ధరలు గణనీయంగా పెరగినప్పటికీ, డిమాండ్ ఎక్కువగా తగ్గకపోవడం భారతదేశంలో బంగారు ఆభరణాల స్థిరత్వాన్ని సూచిస్తోంది.

పన్ను తగ్గింపు ప్రభావం..

2024లో జూలైలో భారత ప్రభుత్వం బంగారం దిగుమతులపై పన్నును తగ్గించడంతో మూడో త్రైమాసికంలో బంగారు కొనుగోళ్లు మరింత పెరిగాయి. బంగారం పెట్టుబడులు 29 శాతం పెరిగి 239.4 టన్నులుగా ఉండగా, 2023లో ఇది 185.2 టన్నులు మాత్రమే. ఇది 2013 తర్వాత అత్యధిక గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్థాయిగా మారింది.

బంగారం రీసైక్లింగ్, దిగుమతుల తగ్గుదల..

2024లో బంగారం రీసైక్లింగ్ 2 శాతం తగ్గి 114.3 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇది 117.1 టన్నులుగా ఉంది. భారతదేశం 2024లో బంగారం దిగుమతులు 4 శాతం తగ్గి 712.1 టన్నులకు పడిపోయాయి, 2023లో ఇది 744 టన్నులుగా ఉంది.

పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు..

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) 2024లో 73 టన్నుల బంగారం కొనుగోలు చేసింది, ఇది 2023లో కొనుగోలు చేసిన 16 టన్నుల కంటే చాలా రెట్లు ఎక్కువ. 

Tags:    

Similar News