అవకాశం దొరికితే భారత్ కోచ్ గా ఉంటానంటున్న.. ఆసీస్ మాజీ ..
తనకు అవకాశం దొరికితే భారత జట్టుకు కోచ్ గా ఉంటానని ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ మనసులోని మాటను బయటపెట్టాడు. మరో నెల రోజుల్లో భారత కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం..
By : Praveen Chepyala
Update: 2024-05-09 10:46 GMT
తనకు అవకాశం దొరికితే భారత జట్టుకు కోచ్ గా ఉంటానని ఆసీస్ మాజీ ఆలౌరౌండర్ షేన్ వాట్సాన్ తెలిపారు. ది ఫెడరల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, ఢిల్లీ క్యాపిటల్స్ (DC)లో అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన వాట్సన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్టుకు ప్రధాన కోచ్ పాత్రను చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా వెల్లడించాడు.
ఇటీవల, అతను పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు వార్తలు వచ్చాయి, కానీ తరువాత అనూహ్యంగా బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వాట్సన్ గత ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ లో క్వెట్టా జట్టుకు ప్రధాన కోచ్ గా బాధ్యతలు నిర్వహించాడు. అలాగే USలోని మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టుకు ప్రధాన కోచ్ గా కూడా పని చేస్తున్నాడు .
రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నారు. అతని కాంట్రాక్ట్ వచ్చే నెల ICC T20 ప్రపంచ కప్ తో ముగుస్తుంది. నిజానికి ద్రావిడ్ పదవి పోయిన ఏడాది ప్రపంచకప్ వరకూ ఉండేది కానీ, టీ20 ప్రపంచ కప్ వరకూ పొడిగించబడింది. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ లో టీమిండియా రన్నరప్ గా నిలిచింది. అయినప్పటికీ బీసీసీఐ ద్రావిడ్, మిగిలిన సిబ్బందిని వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకూ పొడిగించింది.
"నేను కోచింగ్‌ను పూర్తిగా ప్రేమిస్తున్నాను, దాని గురించి ఎటువంటి ప్రశ్న లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో నాకు లభించిన కోచింగ్ అవకాశం, రికీ పాంటింగ్‌కు అసిస్టెంట్ (కోచ్)గా ఉండటం, మేజర్ లీగ్ క్రికెట్ (MLC), అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో నేను ప్రధాన కోచింగ్ అనుభవం సంపాదించాను.
”రెండు ప్రపంచ కప్‌లు రెండు ఐపిఎల్ టైటిల్‌లు గెలుచుకున్న జట్టులో సభ్యుడైన 42 ఏళ్ల వాట్సన్ ఫెడరల్‌తో అన్నారు. “నేను పుస్తకాన్ని (విన్నర్స్ మైండ్ సెట్) వ్రాసిన కారణాలలో ఒకటి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రధాన కోచ్‌గా అవకాశం వస్తే చాలా ఇష్టం. భారతీయ క్రికెట్‌లో ప్రతిభ, నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా ప్రత్యేకమైనది. భారత జట్టుకు కోచ్‌గా అవకాశం ఉంటే, మీరు భారత క్రికెట్ అందించే అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి పని చేయాలనుకుంటున్నా.. అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.