స్వాతి మాలీవాల్ కేసు: కేజ్రీవాల్ పీఏకు ఐదు రోజుల కస్టడీ
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి స్వాతి మాలీవాల్ పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పీఏ భిభవ్ కుమార్ కు కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది.
By : Praveen Chepyala
Update: 2024-05-19 05:42 GMT
స్వాతి మాలివాల్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పీఏ భిభవ్ కుమార్ కు శనివారం కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.
బిభవ్‌ను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టును కోరారు. ఇది తీవ్రమైన కేసని, కాస్త గట్టిగా తగిలిన ప్రాణాలు పోయేవని రిమాండ్ రిపోర్టులో పోలీసులు అభియోగాలు మోపారు. భిభవ్, పోలీసుల విచారణకు సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నాడని నివేదికలో కోర్టుకు ముందుకు తీసుకొచ్చారు. విచారణ కోసం ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. అనంతరం కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
నిందితుడు సహకరించలేదు: ఢిల్లీ పోలీసులు
"ఇది చాలా తీవ్రమైన కేసు, ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్లమెంటు సభ్యుడిపై క్రూరంగా దాడికి పాల్పడ్డాడు. ఇది ప్రాణాంతకమైన దాడి. దీనిపై విచారణ సందర్భంగా భిభవ్ ను పలు ప్రశ్నలు సంధించగా, వేటికి సరైన సమాధానాలు ఇవ్వలేదు. అన్నింటికి దాట వేసే ప్రయత్నం చేశాడని ఢిల్లీ పోలీసు అధికారి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజిత చెప్యాల సంతకం చేసిన రిమాండ్ పేపర్‌లో పేర్కొంది.
రిమాండ్ దరఖాస్తులో మేజిస్ట్రేట్ ముందు మలివాల్ వాంగ్మూలం వైద్యుల నివేదిక రెండు కోర్టు ముందు తెచ్చారు. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ ప్రకారం భిభవ్ ఆమెపై ఏకపక్షంగా దాడికి పాల్పడ్డాడు. ఒక టేబుల్ పై తలను పెట్టి విచక్షణరహితంగా కొట్టాడు. దీనికి సంబంధించి డిజిటల్ వీడియో రికార్డు ఉంది. అయితే అది ఇంకా పోలీసులకు లభించలేదు.
'సాక్ష్యం తారుమారు'
దాడి జరిగిన ప్రదేశంలో ఉన్న వీడియోలను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉన్న ఉన్న వీడియో రికార్డులను అక్కడే పని చేస్తున్న జూనియర్ ఇంజనీర్ పోలీసులకు అందించాడు. అయితే ఇందులో ఉన్న సాక్ష్యాలన్నీ ఖాళీగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఇందులో ఉన్న వీడియోలను తొలగించి పోలీసులకు అందించారని అన్నారు. భిభవ్ తొమ్మిదేళ్లుగా అధికార హోదాలో ఉన్నారని, సాక్షులను బెదిరించి, తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని కోర్టు ముందు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఆరోపించారు.
పోలీసు కస్టడీకి గల కారణాలను వివరిస్తూ, ఏప్రిల్ 2024లో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పదవిని రద్దు చేసిన తర్వాత, కుమార్ ఇప్పటికీ ముఖ్యమంత్రి నివాసంలో పనిచేస్తున్నారని, అతను పని, అధికారం గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నోయిడాలో విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగిపై దాడి చేసినందుకు కుమార్‌పై మరో కేసు నమోదైందని పేర్కొంది.
“సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజాప్రతినిధిపై క్రూరమైన దాడి జరిగింది కాబట్టి, క్రూరమైన దాడి వెనుక ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి, మన దేశానికి విద్వేషపూరితమైన కొందరు వ్యక్తి లేదా సంస్థ కుట్ర కోణాలు లేదా ప్రమేయాన్ని నిర్ధారించడానికి నిరంతర విచారణ చాలా అవసరం. ," అని పేపర్ చెప్పింది. అతని మొబైల్ ఫార్మాట్ చేశానని కుమార్ ఇప్పటికే తను అంగీకరించాడు.