మలమూత్రాలు తీసుకెళ్లే పైప్ పేలితే ఇలా ఉంటుంది..(ఫొటో గ్యాలరీ)

చైనాలోని నాన్నింగ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగిందట. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ ప్రాంతంలో కొత్తగా ఓ సివరేజీ పైపు వేశారు.

By :  Admin
Update: 2024-09-28 13:17 GMT

చైనాలోని నాన్నింగ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగిందట. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ ప్రాంతంలో కొత్తగా ఓ సివరేజీ పైపు వేశారు. ఈ క్రమంలో నిర్మాణ సిబ్బందిపై పైపులో పీడనం ఎంత ఉందో తెలుసుకునేందుకు పరీక్షలు ప్రారంభించగా పైపు హఠాత్తుగా పేలిపోయింది.

 

ఒక్కసారిగా పైపు పేలిపోవడంతో మురుగు నీరు, మానవవ్యర్థాలు ఏకంగా 33 అడుగుల వరకూ ఉవ్వెత్తున ఎగసాయి. అక్కడే ఉన్న పాదచారులు, వాహనదారుల మీద పడటంతో వారంతా మురుగులో తడిసి ముద్దైపోయారు. పరుగుపరుగున అక్కడి నుంచి బయటపడ్డారు.

 

మురుగు నీరు చొరబడి పలు వాహనాలు దుర్గంధ భూయిష్టంగా మారిపోయాయి. ‘‘నా కారు మొత్తం మురుగులో తడిసి పసుపు పచ్చగా మారిపోయింది. కంపు కొడుతోంది. మళ్లీ ఉపయోగించలేని విధంగా నాశనమైంది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు

Tags:    

Similar News