భారత్ - కెనడా మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలు.. అసలు కారణమేంటీ?

కెనడా- భారత్ మధ్య తీవ్ర దౌత్య సంఘర్షణ తలెత్తింది. ఇరు దేశాలు తమ తమ రాయబారులను వెనక్కి పిలిపించుకున్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి..

By :  491
Update: 2024-10-15 06:03 GMT

భారత్- కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరు దేశాలు తమ దేశాలలో ఉన్న దౌత్యవేత్తలను బహిష్కరించాయి. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దిక్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య అధికారిని అనుమానితుల జాబితాలో కెనడా చేర్చడంతో వివాదం రాజుకుంది. దీంతో భారత్ తీవ్ర నిరసనను తెలియజేసింది. కెనడా ఆరోపణలను తీవ్ర పదజాలంతో భారత్ ఖండించింది.

కెనడియన్ ఛార్జ్ డి'ఎఫైర్స్ స్టీవర్ట్ వీలర్స్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)కి పిలిపించి సమన్లు జారీ చేసిన న్యూఢిల్లీ, కొద్దిసేపటికే కెనడాలో ఉన్న భారత హై కమిషనర్ సంజయ్ వర్మ, మరికొందరు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకోవాలని ప్రకటించింది. భారత రాయబారీ, సహ ఇతర సీనియర్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని కెనడాకు తీవ్ర భాషలో సూటిగా సందేశం జారీ చేసింది.
కెనడా కూడా భారత్ కు చెందిన ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలను దేశం విడిచివెళ్లాలని ఆదేశించింది. ఇందులో వర్మ సహ పలువురు అధికారులు ఉన్నారు.
ట్రూడో ఆరోపణలు..
భారత్ తన నిర్ణయాన్ని ప్రకటించిన కొద్దిసేపటికే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విలేకరులు సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదిని తన దేశంలో హత్య చేసిన విషయాన్ని తన ఫైవ్ ఐస్ దేశాలు, ముఖ్యంగా యూఎస్ తో పంచుకున్నట్లు తెలిపారు. హత్య కేసులో భారతీయ ప్రమేయం ఆరోపణలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పంచుకున్నట్లు తెలిపారు.
భారత్ భారీ తప్పు చేసింది: ట్రూడో
పరిస్థితి తీవ్రమైనది. కెనడియన్లు వారి వారి సమాజాలు, ఇళ్లలో ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి హింసకు గురికాకుడదని కోరకుంటున్నాం. భారత్ తో సంబంధాల విషయంలో ఈ ఉద్రిక్తతలు ఉండకూడదనుకుంటున్నామని ట్రూడో చెప్పారు. ఈ విషయం చెప్పడానికి భారత్ ను సంప్రదించామని, కానీ న్యూఢిల్లీ ఈ విషయంలో ఎలాంటి సహాకారం అందించలేదని ఆయన ఆరోపించారు. తమ దేశ పౌరుల శ్రేయస్సు దృష్ట్యా ఈ కఠినమైన చర్య తీసుకున్నామని చెప్పారు.
సాక్ష్యాలు ఉన్నాయి.. కెనడా
ఈ విషయమై గత వారం తాను ప్రధాని నరేంద్ర మోదీని కలిశానని, మాట్లాడానని ట్రూడో చెప్పారు. "RCMP కమిషనర్ ఇంతకు ముందు చెప్పినట్లుగా, భారత ప్రభుత్వ ఏజెంట్లు రహస్య సమాచార సేకరణ పద్ధతులు, దక్షిణాసియాను లక్ష్యంగా చేసుకుని బలవంతపు ప్రవర్తనతో సహా ప్రజా భద్రతకు గణనీయమైన ముప్పు కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని వారికి స్పష్టమైన, బలవంతపు ఆధారాలు ఉన్నాయి. కెనడియన్ల హత్యతో సహా డజనుకు పైగా బెదిరింపు, హింసాత్మక చర్యలలో వారి ప్రమేయం ఉంది ” అని ట్రూడో చెప్పారు. మా దేశ అధికారులు ఈ విషయంపై భారత అధికారులతో చర్చించినప్పటికీ వారు ఆ ఆధారాలను పదేపదే తిరస్కరించారని ఆరోపించారు.
ఆరుగురు దౌత్యవేత్తలు..
అయితే భారతదేశం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. సోమవారం సాయంత్రం ప్రకటనలో, ఛార్జ్ డి అఫైర్స్ వీలర్స్, డిప్యూటీ హైకమిషనర్ ప్యాట్రిక్ హెబర్ట్‌తో సహా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను అక్టోబర్ 19 రాత్రి 11.59 గంటలలోపు లేదా అంతకంటే ముందు భారతదేశం విడిచి వెళ్లాలని న్యూఢిల్లీ ఆదేశించినట్లు MEA తెలిపింది.
బహిష్కరించబడిన ఇతర దౌత్యవేత్తలు మేరీ కేథరీన్ జోలీ, ఇయాన్ రాస్, డేవిడ్ ట్రిట్స్, ఆడమ్ జేమ్స్ చుయిప్కా, పౌలా ఓర్జులా (అందరూ మొదటి కార్యదర్శులు).
వర్మపై కెనడా చేసిన ఆరోపణలకు ప్రతిస్పందనగా, న్యూ ఢిల్లీ వాటిని "కల్పితం", కెనడా "అనుకూలమైన ఆరోపణలు"గా అభివర్ణించింది. "వోటు బ్యాంకు రాజకీయాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న ట్రూడో ప్రభుత్వం రాజకీయ ఎజెండా"కు ఆరోపణలను ఆపాదించిందని విమర్శించింది.
కెనడా ప్రభుత్వంపై విశ్వాసం లేదు: భారత్
విదేశాంగశాఖ తన ప్రకటనలో, "భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు ఆ దేశంలో దర్యాప్తుకు సంబంధించిన విషయంలో అనుమానిత వ్యక్తులు అని కెనడా నుంచి భారత్ కు దౌత్య సమాచారం అందించింది’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.
MEA కార్యదర్శి (తూర్పు) జైదీప్ మజుందార్ కెనడా అధికారి వీలర్‌లను పిలిపించారు. కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భారత్ దౌత్యవేత్తలు, ఇతర అధికారుల భద్రతకు ప్రమాదకరంగా మారాయని ఆయన గట్టిగా చెప్పారు.
"ప్రస్తుత కెనడియన్ ప్రభుత్వం వారి భద్రతకు భరోసా ఇవ్వడంపై మాకు నమ్మకం లేదు. అందువల్ల, హైకమిషనర్ ఇతర లక్ష్య దౌత్యవేత్తలు, అధికారులను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది” అని MEA తెలిపింది. "భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాదం, హింస, వేర్పాటువాదానికి ట్రూడో ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందనగా తదుపరి చర్యలు తీసుకునే హక్కు భారతదేశానికి ఉందని కూడా తెలియజేసింది" అని పేర్కొంది. మరికొద్ది రోజుల్లో వర్మ, ఇతర అధికారులు కెనడా నుంచి తిరిగి రానున్నట్లు సమాచారం.
కెనడా సాక్ష్యాలను అందించింది: ఛార్జ్ డి'ఎఫైర్స్
నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్- కెనడా మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. గతేడాది జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపణలు గుప్పించారు. కానీ ఇది అసంబద్ధం అని భారత్ ఖండించింది.
కెనడియన్ ఛార్జ్ డి అఫైర్స్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ అడుగుతున్న సమాచారాన్ని అందజేశాం. హంతకులకు, దౌత్యవేత్తల మధ్య ఉన్న సంబంధాన్ని, తిరుగులేని సాక్ష్యాల రూపంలో అందించామని చెప్పారు.
MEA ప్రకటన
కానీ ఈ ప్రకటలను భారత ప్రభుత్వం తిరస్కరించింది. 2023 వరకూ అనేక అభ్యర్థనలు చేసినప్పటికీ కెనడా కనీసం ఒక్కసాక్ష్యాన్ని అయిన ఇవ్వలేదని వెల్లడించింది. అంతేకాకుండా ట్రూడో ప్రభుత్వం భారత దేశ అంతర్గత రాజకీయాల్లోకి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిందని, రైతుల ఆందోళన ముసుగులో జరిగిన ఆందోళనల విషయంలో ట్రూడో వ్యాఖ్యలను గుర్తు చేసింది.
రాజకీయాల గురించి భారత్ వాదన..
ట్రూడో తన రాజకీయ భవిష్యత్, ప్రభుత్వ మనుగడ కోసం విచారణ సాకుతో ఇతర దేశాలపై ఆరోపణలు గుప్పిస్తున్నారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో ఆరోపించింది. తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రూడో భారత్ తో శత్రుత్వం కోరుకుంటున్నారని, ఆయన వ్యవహర శైలి ఇదే తెలియజేస్తోందని తెలిపింది.
"భారత్‌కు సంబంధించి తీవ్రవాద - వేర్పాటువాద ఎజెండాతో బహిరంగంగా సంబంధం ఉన్న వ్యక్తులను అతని క్యాబినెట్ చేర్చుకుంది" అని MEA తెలిపింది. "డిసెంబరు 2020లో భారత అంతర్గత రాజకీయాల్లో ఆయన బహిరంగ జోక్యం చేసుకోవడం, ఈ విషయంలో ఆయన ఎంత దూరం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారో చూపిస్తుంది" అని పేర్కొంది.
"అతని ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీపై ఆధారపడి ఉంది, దాని నాయకుడు భారతదేశానికి వ్యతిరేకంగా వేర్పాటువాద భావజాలాన్ని బహిరంగంగా సమర్థిస్తున్నాడు " అని అది పేర్కొంది.
"భారత వ్యతిరేక వేర్పాటువాద ఎజెండా"
భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకున్న కెనడా, తన తదుపరి చర్యగా వారిని అనుమానితుల జాబితాలో చేర్చుకుందని వెల్లడించింది. "ట్రూడో ప్రభుత్వం సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం నిరంతరం పన్నుతున్న భారత వ్యతిరేక వేర్పాటువాద ఎజెండాకు కూడా ఇది ఉపయోగపడుతుంది" అని విమర్శించింది.
దౌత్యవేత్తలపై ఆరోపణలు హస్యాస్పదం: న్యూఢిల్లీ
“ఈ చర్యలన్నీ వాక్ స్వాతంత్ర్యం పేరుతో కెనడాలో సమర్థించబడ్డాయి’’. చట్టవిరుద్ధంగా కెనడాలోకి ప్రవేశించిన కొంతమంది వ్యక్తులు పౌరసత్వం కోసం ఇక్కడా తమ ఆటలు ఆడుతున్నారు. "కెనడాలో నివసిస్తున్న తీవ్రవాదులు, వ్యవస్థీకృత నేర నాయకులకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి వచ్చిన బహుళ అభ్యర్థనలు విస్మరించబడ్డాయి" అని ఎంఈఏ పేర్కొంది. హైకమిషనర్ వర్మ 36 ఏళ్ల పాటు విశిష్టమైన కెరీర్‌తో భారతదేశానికి అత్యంత సీనియర్ దౌత్యవేత్త అని MEA తెలిపింది.
"అతను జపాన్ - సూడాన్‌లలో రాయబారిగా ఉన్నాడు, ఇటలీ, టర్కీ, వియత్నాం, చైనాలో కూడా పనిచేశాడు. కెనడా ప్రభుత్వం అతనిపై చూపిన ఆక్షేపణలు హాస్యాస్పదమైనవి ” అని పేర్కొంది. "ప్రస్తుత పాలకుల రాజకీయ ఎజెండాకు ఉపయోగపడే భారతదేశంలోని కెనడియన్ హైకమిషన్ కార్యకలాపాలను భారత ప్రభుత్వం గుర్తించింది" అని విదేశాంగశాఖ పేర్కొంది.


Tags:    

Similar News