ఆ రాక్షసీ మళ్లీ వచ్చింది.. మరోసారి వణికిస్తుందా?

ప్రపంచాన్ని ఆగం చేసి, కోట్లాది మంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన ఆ వైరస్ మరోసారి విభృంభిస్తోంది. ఆసియా సింహమైన ఆదేశంలో మరోసారి దాని తీవ్రత పెరుగుతోంది.

Update: 2024-05-19 10:34 GMT

ప్రపంచాన్ని రెండు సంవత్సరాలు గడగడ వణికించిన వూహన్ వైరస్ మరోసారి తన పంజా విసురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సింగపూర్ లో గత కొన్ని రోజులుగా కోవిడ్ ఇన్ ఫెక్షన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ అన్నారు.

కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయని ఓంగ్ శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని పేర్కొన్నారు. జూన్ మధ్య వారం వరకు ఇది చేరుకుంటుందని అన్నారు. వృద్ధులు, వైద్యపరంగా బలహీనంగా ఉన్నవారు,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు చైనా వైరస్ రక్షణగా వ్యాక్సిన్ తీసుకోని వారు ప్రస్తుతం మరోసారి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

మే 5 నుంచి 11 వరకే కేసుల అంచనా సంఖ్య 25,900 వరకు పెరిగిందని అన్నారు. అంతకుముందు వారంలో కేసుల సంఖ్య 13,700 గా ఉండేదని అన్నారు. సగటు కేసుల సంఖ్య రోజువారిగా 180 నుంచి 250 వరకు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల కేసులు సంఖ్యకూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కోవిడ్ కేసులు రెట్టింపు అయినా సింగపూర్ ఆరోగ్యసంరక్షణ వ్యవస్థ తట్టుకోగలదని ఆరోగ్యమంత్రి అన్నారు. అయితే ఆరోగ్యరంగంపై అది పెనుభారం కాగలదని అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. మరోసారి లాక్ డౌన్ దిశగా వెళ్లకూడదనుకుంటే కచ్చితంగా ఆరోగ్యం దృష్టి సారించాలని కోరారు.


Tags:    

Similar News