కేజ్రీవాల్‌ను చంపేందుకు జైలులో కుట్ర జరుగుతోందా?

అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఢిల్లీ సీఎంకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

Update: 2024-04-20 10:02 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ను నిరాకరించడం, ఆయనను కలవడానికి వైద్యులను అనుమతించకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్‌ను తీహార్ జైలులోనే అంతమొందించేందుకు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

కేజ్రీవాల్ గత 20-22 సంవత్సరాలుగా టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఇన్సులిన్ కావాలని ఆయన అడిగారు. ఫ్యామిలీ డాక్టర్‌తో మాట్లాడాలని కోరారు. అయితే కేజ్రీవాల్ అభ్యర్థనను జైలు అధికారులు తిరస్కరించారు’’ అని పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో అన్నారు.

"కేజ్రీవాల్ నెమ్మదిగా మరణించడానికి కుట్ర జరుగుతోందని నేను ఖచ్చితంగా చెప్పగలను." అని జైల్లో ముఖ్యమంత్రి బ్లడ్ షుగర్ రిపోర్టులను ఉటంకిస్తూ భరద్వాజ్ పేర్కొన్నారు.

కేజ్రీవాల్ తరుపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పటి నుండి షుగర్ లెవల్స్‌ను నియంత్రించడానికి ఇన్సులిన్ ఇవ్వలేదని, ఇది ఆందోళన కలిగించే అంశం అని పేర్కొన్నారు.

కాగా మెడికల్ బెయిల్‌ పొందేందుకు కేజ్రీవాల్ రోజూ మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ED కోర్టుకు తెలిపింది. ED వాదనను కేజ్రీవాల్ తోసిపుచ్చారు. తానే తినే ఆహారం తన వైద్యుడు తయారుచేసిన డైట్ చార్ట్‌కు అనుగుణంగా ఉందని జడ్డికి చెప్పారు. "ఇంటి నుండి పంపుతున్న భోజనంతో పాటు కేవలం మూడు సార్లు మాత్రమే మామిడి పండ్లు పంపబడ్డాయి." అని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్ చెక్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని భరద్వాజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

"మొత్తంమీద కేజ్రీవాల్‌ను అంతం చేయడానికి కుట్ర జరుగుతోంది. షుగర్ నియంత్రణకు మందులు తీసుకోకపోవడం వల్ల అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది.జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మూత్రపిండాలు, గుండె, ఇతర అవయవాలకు చికిత్స కోసం వెళ్లాల్సి వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి భరద్వాజ్ అన్నారు.

Tags:    

Similar News