ట్రంప్ మొదటి దెబ్బ కెనడా పైనే.. లిస్టులో మెక్సికో, చైనా

వచ్చే ఏడాది జనవరి 20 న తాను పగ్గాలు చేపట్టిన మొదటి రోజు కెనడా, మెక్సికో, చైనా పై భారీగా సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించారు. కెనడా నుంచి డ్రగ్స్, క్రైమ్స్..

By :  491
Update: 2024-11-26 06:19 GMT

అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్, తను టారిఫ్ విధించబోయే దేశాల లిస్ట్ ప్రకటించారు. అందులో వాషింగ్టన్ అనుంగు శిష్యుడిగా ముద్రపడ్డ అట్టావాపైనే మొదటి దెబ్బ పడబోతోంది. తరువాత వరుసలో మెక్సికో, చైనాలు ఉన్నాయి.

ఈ దేశాల నుంచి అక్రమ వలసలు, మాదకద్రవ్యాలు, అక్రమ ఉత్పత్తులు వస్తున్నాయని, వీటిపై భారీగా సుంకం విధిస్తామని ఆయన ప్రకటించారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం, చైనా పై 10 శాతం టారీఫ్ విధించబోతున్నట్లు వెల్లడించారు.

సోమవారం తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో వరుస పోస్ట్‌లలో ఈ విషయం వెల్లడించారు. జనవరి 20న అధికారం చేపట్టిన తర్వాత తన మొదటి చర్యల్లో ఒకటిగా మూడు దేశాలపై సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేస్తానని చెప్పారు.
"ప్రతి ఒక్కరికి తెలిసినట్లుగా, వేలాది మంది ప్రజలు మెక్సికో, కెనడా గుండా పోటెత్తుతున్నారు. వీరంతా అమెరికాలో మునుపెన్నడూ లేని స్థాయిలో క్రైమ్, డ్రగ్స్‌ని తీసుకువస్తున్నారు. ప్రస్తుతం, మెక్సికో నుంచి ఉన్న ఓపెన్ బార్డర్ ద్వారా వేలాది మంది వ్యక్తులతో కూడిన ఒక కారవాన్ దేశంలోకి రావాలనే ఉబలాడపడుతున్నారు’’ అని ట్రంప్ అన్నారు.
"జనవరి 20వ తేదీన, నా మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో ఒకటిగా, మెక్సికో, కెనడాకు యునైటెడ్ స్టేట్స్‌లోకి వచ్చే అన్ని ఉత్పత్తులపై 25% సుంకం విధించడానికి అవసరమైన అన్ని పత్రాలపై సంతకం చేస్తాను. వారు అక్రమ వలసలపై చర్యలు తీసుకునే వరకు ఈ చర్యలు తప్పవని హెచ్చరించారు.
"మత్తుపదార్థాలు, ప్రత్యేకించి ఫెంటానిల్, చట్టవిరుద్ధమైన విదేశీయులందరూ మన దేశంపై ఈ దండయాత్రను ఆపే వరకు ఈ సుంకం అమలులో ఉంటుంది! మెక్సికో, కెనడా రెండింటికీ ఈ దీర్ఘకాలంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ సమస్యను సులభంగా పరిష్కరించే సంపూర్ణ హక్కు, శక్తి ఉన్నాయి" అని ట్రంప్ చెప్పాడు.
"వారు తమ శక్తిని వాటిని నివారించడానికి ఉపయోగించాలని మేము కోరుతున్నాము. ఈ సమస్యలపై తగిన చర్య తీసుకునేందుకు, ఇలా మూల్యం చెల్లిస్తునే ఉంటారు. దానికి సమయం ఆసన్నమైంది" అని ట్రంప్ అన్నారు. తమ దేశంలోని డ్రగ్స్ ప్రవాహాన్ని ఆపడంలో చైనా విఫలం అయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నేను భారీ మొత్తంలో డ్రగ్స్, ముఖ్యంగా ఫెంటానిల్, యునైటెడ్ స్టేట్స్‌లోకి పంపబడటం గురించి చైనాతో చాలా చర్చలు జరిపాను - కానీ ప్రయోజనం లేదు" అని ట్రంప్ అన్నారు. "ఏ డ్రగ్ డీలర్లు అయిన పట్టుబడితే వారికి గరిష్టంగా మరణశిక్ష విధిస్తామని చైనా ప్రతినిధులు నాతో చెప్పారు.
కానీ అలాంటి చర్యలు తీసుకున్న దాఖలా కనిపించడం లేదని" ట్రంప్ ఆరోపించారు. ఇలా డ్రగ్స్ ను కట్టడి చేసే వరకూ చైనాపై, యూఎస్ఏ టారిఫ్ లు విధిస్తునే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం చైనాపై పదిశాతం సుంకం విధిస్తున్నామని, భవిష్యత్ లో మరోసారి వీటిని పరిశీలిస్తామని అన్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై జనవరి 20, 2025న తన అధ్యక్ష పదవికి మొదటి రోజు సంతకం చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.



Tags:    

Similar News